MOBILE OFFER: వదలొద్దు మావా.. 8GB/256GB స్మార్ట్‌‌ఫోన్‌పై రూ.17000 తగ్గింపు..!

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. 8/256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర విడుదల సమయంలో రూ.40,999గా ఉంది. ఇప్పుడు రూ.17000 తగ్గింపుతో కేవలం రూ.23,999లకే కొనుక్కోవచ్చు. ఆసమ్ గ్రాపిక్ కలర్ వేరియంట్‌కే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

New Update
SAMSUNG Galaxy A54 5G Smartphone available on flipkart at huge discount

SAMSUNG Galaxy A54 5G Smartphone available on flipkart at huge discount

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్ ఆఫర్ అందుబాటులో ఉంది. అధునాతన ఫీచర్లు, రఫ్పాడించే కెమెరా గల సరికొత్త 5జీ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. 

గతేడాది భారత మార్కెట్‌లో లాంచ్ అయిన SAMSUNG Galaxy A54 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ఉంది. దీని 8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై ప్రస్తుతం డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. అందువల్ల ఎప్పటి నుంచో ఒక మంచి ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన అవకాశం అని చెప్పుకోవాలి.

Also Read :వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?

రెండు వేరియంట్లు

Samsung Galaxy A54 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌. ఇందులో 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర విడుదల సమయంలో రూ.38,999 గా ఉంది. అలాగే 256GB స్టోరేజీ ధర రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 256GB స్టోరేజీ వేరియంట్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ.23,999 కే కొనుక్కోవచ్చు. 

రూ.17000 డిస్కౌంట్‌ 

Samsung Galaxy A54 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.17000 డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను లభిస్తుంది. అయితే Awesome Graphite కలర్‌ వేరియంట్‌లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 

Galaxy A54 5G Specifications

Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!

Samsung Galaxy A54 5G స్మార్ట్‌ఫోన్‌ 6.4 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, విజన్‌ బూస్టర్‌ ఫీచర్‌‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత One UI 5.1తో వస్తుంది. అండర్ ది హుడ్‌ Exynos 1380 చిప్‌సెట్‌‌ను కలిగి ఉంది.

వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ కెమెరా, 5MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు