Indian Market: రూపాయి @ 91..మళ్ళీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం దీని విలువ డాలర్ కు 91 రూ. చేరుకుంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ మళ్ళీ ఈరోజు భారీ నష్టాలను చవి చూసింది. నిఫ్టీ 26 వేల దిగువకు పడిపోయింది.

New Update
rupee@91

రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. భారత్‌-అమెరికా డీల్‌పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి లేవడమే లేదు. అంతకంతకూ దీని విలువ దిగజారిపోతూనే ఉంది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలర్ కు 91రూ. గా ఉంది. ఇది మరికొనని రోజుల్లోనే వందకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మొదటిసారి కనిష్టాల్లోకి జారింది. ఏకంగా 91 మార్క్‌ దాటి సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. క్రితం సెషన్‌లో డాలరుతో పోలిస్తే 90.78 వద్ద ముగిసిన రూపాయి విలువ..ఈరోజు ప్రాంభంలోనే మరింత పతనమై..ఏకంగా 36 పైసలు తగ్గి 91.14 వద్ద ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయింది.

మళ్ళీ 26 వేల దిగువకు నిఫ్టీ..

మరోవైపు భారత స్టాక్ మార్కెట్ పరిస్థితి కూడా ఏం బాలేదు. మళ్ళీ  సెన్సెక్స్ 50 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 26 వేల దిగువకు పడిపోయాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు గ రెండు వారాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో సైతం ప్రతికూల సంకేతాలు, రూపాయి విలువ పడిపోవడం లాంటివి కూడా మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. వీటి కారణంగా మెటల్‌, రియల్టీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్ 534 పాయింట్లు పడిపోయి 84,680 వద్ద ముగియగా.. నిఫ్టీ కూడా 167 పాయింట్లు పడిపోయి 25,860 వద్ద ముగిసింది. ఈరోజు సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో ఇరవై మూడు నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంక్, జొమాటో 5% తగ్గాయి. టైటాన్, ఎయిర్‌టెల్ దాదాపు 2% లాభపడ్డాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్‌లలో ముప్పై తొమ్మిది స్టాక్‌లు క్షీణించాయి. NSEలో బ్యాంకింగ్, రియాలిటీ, మెటల్, ఆటో, ఫార్మాస్యూటికల్ స్టాక్‌లు నష్టాల్లో తేలాయి. మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్‌లు లాభాలతో ముగిశాయి.

ప్రపంచ మార్కెట్లలో క్షీణత..

ప్రపంచ మార్కెట్లు సైతం డీలా పడిపోయాయి. అక్కడ కూడా సూచీలన్నీ నష్టాల్లోనే ఈదాయి. ఆసియా మార్కెట్లలో.. కొరియా కోస్పి 2.24% తగ్గి 3,999 వద్ద, జపాన్ నిక్కీ ఇండెక్స్ 1.56% తగ్గి 49,383 వద్ద ముగిశాయి. హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ సూచీ 1.54% తగ్గి 25,235 వద్ద ముగియగా.. చైనా షాంఘై కాంపోజిట్ 1.11% తగ్గి 3,825 వద్ద ముగిసింది. అమెరికా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే..డిసెంబర్ 15న US డౌ జోన్స్ 0.086% తగ్గి 48,416 వద్ద ముగిసింది. అదే సమయంలో.. నాస్‌డాక్ కాంపోజిట్ 0.59%,  S&P 500 0.16% పడిపోయాయి.

Advertisment
తాజా కథనాలు