/rtv/media/media_files/2025/01/26/URJD9tArrPos3qfY0nCJ.jpg)
realme P1 5G smartphone available flipkart
ఒక కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారా? కానీ అధిక ధర కారణంగా వెనక్కి తగ్గుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త 5జీ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. భారీ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ పరంగా ఈ ఫోన్ హైక్లాస్‌గా ఉంది. దీనికి సంబంధించి డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.
Also Read: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
realme P1 5G Offer
ఫ్లిప్‌కార్ట్‌లో realme P1 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్ అందిస్తోంది. దీని 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధరను కంపెనీ రూ. 20,999గా నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఏకంగా 33 శాతం తగ్గింపు ప్రకటించింది. ఈ తగ్గింపుతో realme P1 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.13,999లకే లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా దీనిపై అదనంగా రూ.1000 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు ఈ ఫోన్‌ను రూ.12,999లకే కొనుక్కోవచ్చు. దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.8,450 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే realme P1 5G ఫోన్‌ను కేవలం రూ.4,549లకే సొంతం చేసుకోవచ్చు.
Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?
ఈ ఫోన్ 6.67 inch అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కెమెరా పరంగా కూడా అద్భుతంగా ఉంది. 50ఎంపీ + 2ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. ఇంకా డైమెన్సిటీ7050 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చబడి ఉంది.