RBI New Rule: ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునేవారికి బిగ్ షాక్!

డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం వాడే వారికి షాక్. తర్వలో ఏటీఎం సర్వీస్ ఛార్జీలను పెంచాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది. 5 ఫ్రీ విత్‌డ్రాల తర్వాత చేసే నగదు ఉపసంహరణకు ఈ ఛార్జీలు వర్తించనున్నాయి. ఛార్జీలు పెంచాలని NPCI సిఫార్సు చేసింది.

New Update
RBI plans to increase ATM charges

RBI plans to increase ATM charges Photograph: (RBI plans to increase ATM charges)

RBI New Rule: కార్డ్ ద్వారా డబ్బులు ATMలో డ్రా చేయడం, ATM క్యాష్‌లెస్ సర్వీస్‌లు చేసేవారికి షాక్. ATM వినియోగదారులకు సర్వీస్ ఛార్జీలు పెంచాలని RBI ఆలోచిస్తోంది. ద్రవ్యోల్బణం, అధిక రుణ వ్యయాలు, రవాణా, నగదు భర్తీకి సంబంధించిన ఖర్చుల కారణంగా బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నాయి. ఏటీఎం ఆపరేటర్లకు, ముఖ్యంగా మెట్రోయేతర ప్రాంతాల్లో నిర్వహణ ఖర్చులను భరించడానికి, ఏటీఎం సేవల సుస్థిరతకు సాయపడడానికి ఈ పెంపు అవసరమని బ్యాంకులు భావిస్తున్నాయి. 

Also Read: భర్తకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ప్రియుడితో శృంగారం.. చివరికి ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్!

సంవత్సరానికి 5 విత్‌డ్రాలు ఫీగా చేసుకోవచ్చు. తర్వాత ఏటీఎం ద్వారా మనీ విత్‌డ్రా చేస్తే ఛార్జీలు వర్తిస్తాయి. ఉచిత నగదు ఉపసంహరణల తర్వాత ప్రతి విత్‌‌డ్రాకు రూ.21 నుంచి రూ.22 లు పెంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసింది. ఇతర బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే ఆ ఛార్జీలు రూ.17 నుంచి రూ.19 లకు, క్యాష్‌లెస్ సర్వీస్‌లకు రూ.6 నుంచి రూ.7 వరకు పెరగవచ్చని సమాచారం.

Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

ఈ సిఫార్సులను ఆర్‌బీఐ ఆమోదిస్తే వినియోగదారులు ఉచిత పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలకు చెల్లించే ఫీజు పెరుగుతుంది. ప్రతిపాదిత ఫీజుల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్‌బీఐ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు మాత్రం పెరుగుదలకు కోరుకుంటున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు