Post office Scheme: అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్.. ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసాారిగా రూ.20 లక్షలు.. ఎలాగంటే?

పోస్టాఫీసులో ఉండే పథకాల్లో కిసాన్ వికాస్ పత్రా (KVP) ఒకటి. ఈ పథకం ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇందులో పెట్టిన డబ్బు ఒక నిర్దిష్ట కాలంలో రెట్టింపు అవుతుంది.

New Update
post office

Post office

పోస్టాఫీసులో ఎన్నో స్కీమ్స్ ఉంటాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే పోస్టాఫీసులో ఉండే పథకాల్లో కిసాన్ వికాస్ పత్రా (KVP) ఒకటి. ఈ పథకం ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇందులో పెట్టిన డబ్బు ఒక నిర్దిష్ట కాలంలో రెట్టింపు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చే ఈ పథకం భద్రతతో పాటు లాభాలు కూడా భారీ వస్తాయి. ఇందులో తక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కనీసంగా రూ.1000 ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు రెట్టింపు డబ్బులు వస్తాయి. మీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే.. మీకు ఈ పథకంపై ఏటా 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. చక్రవడ్డీ పద్ధతిలో దీన్ని లెక్కిస్తారు. అంటే మీకు వచ్చే వడ్డీ కూడా మళ్లీ అసలుకు కలిసి దానిపై కూడా వడ్డీ లభిస్తుంది. ఈ 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం మీరు పెట్టిన డబ్బు సుమారు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది.

రూ.10 లక్షలకు రూ.20 లక్షలు..

ఉదాహరణకు మీరు  రూ.10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ తర్వాత మీకు రూ.20 లక్షల రూపాయలు అందుతాయి. ఈ పథకానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి లాస్ కూడా ఉండదు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు అంతా కూడా వచ్చేస్తుంది. ఈ పథకంలో పెట్టుబడిదారులకు ఎన్నో అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో నామినీ సౌకర్యం ఉంది. ఒకవేళ పెట్టుబడిదారుడు మరణిస్తే ఆ డబ్బు నామినీకి అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన పత్రాన్ని ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ కిసాన్ వికాస్ పత్రాను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. దేశంలోని ఏ పోస్టాఫీసులోనైనా ఈ పథకాన్ని కొనుగోలు చేయవచ్చు, లేదా అవసరమైతే వేరే పోస్టాఫీసు బ్రాంచ్‌కి బదిలీ చేయవచ్చు.

ఇది కూడా చూడండి: Jio Cheapest Recharge Plan: జియో ఊచకోత ప్లాన్ భయ్యా.. 3 నెలల హాట్‌స్టార్, 25GB డేటా ఫ్రీ..!

కిసాన్ వికాస్ పత్రా పథకానికి సాధారణంగా లాక్-ఇన్ పీరియడ్ 2.5 సంవత్సరాలు (30 నెలలు) ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టిన 30 నెలల లోపు మీరు డబ్బును వెనక్కి తీసుకోలేరు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం ముందుగా డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారుడు మరణించినప్పుడు లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే లాక్-ఇన్ పీరియడ్ ముగియకముందే డబ్బును వెనక్కి తీసుకోవడానికి అనుమతిస్తారు.

ఇది కూడా చూడండి: Scooty Offers: స్కూటీ మస్తుంది మచ్చా.. రూ.69,096 లకే అదిరిపోయే మైలేజ్ - ఫీచర్లు మైండ్ బ్లోయింగ్

Advertisment
తాజా కథనాలు