/rtv/media/media_files/2025/11/16/mileage-scooty-2025-11-16-21-29-04.jpg)
mileage scooty
హోండా యాక్టివాకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అదే కంపెనీ నుండి వచ్చిన మరో స్కూటర్ Honda Dio 110 పై కూడా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీని స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, తక్కువ ధర కారణంగా వాహన ప్రియులు ఈ స్కూటర్‌ను ఇష్టపడుతున్నారు. దీని ధర విషయానికొస్తే.. Honda Dio 110 స్టాండర్డ్ వేరియంట్ రూ.69,096 ధరతో ప్రారంభం అవుతుంది. DLX వేరియంట్ ధర రూ.79,973 ఎక్స్-షోరూమ్ నుండి మొదలవుతుంది.
Honda Dio 110 specs
Honda Dio 110 స్కూటర్ 109.51cc, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ eSP (ఎన్‌హాన్స్డ్ స్మార్ట్ పవర్) టెక్నాలజీని కూడా కలిగి ఉంది. సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ (ACG), నిశ్శబ్ద ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 7.65 bhp, 9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ట వేగం గంటకు 83 కి.మీగా ఉంది.
Honda Dio 110 మైలేజ్ విషయానికొస్తే.. ఈ స్కూటీ 48-55 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇది 5.3-లీటర్ ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. Honda Dio 110 స్పోర్టీ డిజైన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, గ్రాఫిక్స్, LED హెడ్‌ల్యాంప్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS), ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, ట్యూబ్‌లెస్ టైర్లుతో వస్తుంది. 4.2-అంగుళాల TFT డిస్ప్లే ఉంది. ఇది రియల్-టైమ్ మైలేజ్, బ్యాటరీ ఇండికేటర్‌ను చూపుతుంది.
Follow Us