/rtv/media/media_files/2024/11/30/gxqUibm2vd9LMF88JZW4.jpg)
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు రయ్ రయ్‌మంటున్నాయి. కొత్త కొత్త కంపెనీలు భారతదేశంలో తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో కంపెనీ భారతదేశంలో అతి చౌకన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది.
ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!
చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్
ముంబైకి చెందిన EV స్టార్టప్ PMV ఎలక్ట్రిక్ భారతదేశంలో EaS-E మైక్రోకార్‌ను విడుదల చేసింది. ఈ PMV EaS-E ప్రారంభ ధరను రూ. 4.79 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే టాటా నానో ఎలక్ట్రిక్ కారు భారత్‌లో లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఇది రూ.5లక్షల ప్రారంభ ధరతో రానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు PMV EaS-E ఎలక్ట్రిక్ కారు రూ.4.79 లక్షలకు అందుబాటులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?
దీంతో చాలా మంది వాహన ప్రియులు ఈ కారుపై ఆసక్తి చూపినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ మైక్రోకార్ కోసం 6,000 కంటే ఎక్కువ ప్రీఆర్డర్‌లను పొందినట్లు కంపెనీ తెలిపింది. ఆసక్తి గల వారు కేవలం రూ.2000 టోకెన్‌తో బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే
ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ కారులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ కారు 13.41bhp పవర్, 50Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌తో ఒకే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది మూడు రేంజ్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. ఏకంగా 120 కిలో మీటర్లు, 160 కిలో మీటర్లు, 200 కిలో మీటర్ల మైలేజీ అందించే విధంగా బ్యాటరీ మార్చుకోవచ్చు.
ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?
ఇంకా ఇది గంటకు 70 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 48 వోల్ట్ బ్యాటరీ అందించారు. అలాగే ఇందులో బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డోర్ లాక్/ అన్‌లాక్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా EaS-E మోడ్, మైక్రో సెగ్మెంట్, క్లచ్, ఆటోలాక్, గేర్‌బాక్స్ లేవు. అయితే దీనికి కేవలం 4 గంటలు ఛార్జింగ్ చేస్తే సరిపోతుందని కంపెనీ చెబుతోంది.