Oppo Reno 13 5G series: ఒప్పో నుంచి కిర్రాక్ ఫోన్ రెడీ.. ఫీచర్లు కుమ్మేశాయ్!

ఒప్పో నుంచి మరో కొత్త సిరీస్ రాబోతుంది. ఒప్పో రెనో 13 5G సిరీస్ జనవరి 9న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది రెండు మోడళ్లలో వస్తుంది. లాంచ్ ఈవెంట్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌తో సహా కంపెనీ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయబడుతుంది.

New Update
Oppo Reno 13 5G series

Oppo Reno 13 5G series

దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో కంపెనీకి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా సిరీస్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఒప్పో తన లైనప్‌లో ఉన్న మరో సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Oppo Reno 13 5G సిరీస్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. 

రెండు మోడళ్లు లాంచ్

జనవరి 9న మార్కెట్‌లో ప్రారంభించబడుతుంది. ఈ సిరీస్ రెండు మోడళ్లలో రానుంది. ఒకటి Oppo Reno 13 5G, మరొకటి Oppo Reno 13 Pro 5G మోడళ్లు. దీని లాంచ్ ఈవెంట్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌తో సహా కంపెనీ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయబడుతుంది. కాగా ఇప్పటికే Reno 13 5G సిరీస్ నవంబర్ 2024లో చైనాలో ప్రారంభమైంది. 

కలర్ వేరియంట్స్

Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?

త్వరలో విడుదల కానున్న భారతీయ వేరియంట్‌లు చైనా వెర్షన్‌ మాదిరిగానే అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. Oppo Reno 13 ఐవరీ వైట్, లూమినస్ బ్లూ కలర్‌లో అందుబాటులోకి రానుంది. ఇక Oppo Reno 13 ప్రో గ్రాఫైట్ గ్రే, మిస్ట్ లావెండర్‌ కలర్ వేరియంట్‌లో రిలీజ్ కానుంది. 

ర్యామ్ అండ్ స్టోరేజ్

Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్!

Oppo Reno 13 5G 8GB RAMతో 128GB స్టోరేజ్ 256GB స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే Oppo Reno 13 Pro 5G 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్‌లతో 12GB RAMని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండు మోడల్‌లు Oppo సిగ్నల్‌బూస్ట్ X1 చిప్‌లతో జతచేసిన MediaTek డైమెన్సిటీ 8350 SoC ని పొందుతాయి.

కెమెరా

Also Read: 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ కు కియారా అందుకే రావట్లేదా..?

కెమెరా విషయానికొస్తే.. Oppo Reno 13 Pro 5G.. 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌ని కలిగి ఉంటుంది. రెండు ఫోన్‌లు AI- మద్దతు ఉన్న ఇమేజింగ్ ఫీచర్లతో వస్తుంది. అలాగే Reno 13 Pro 5G ఫోన్.. 80W SuperVOOC వైర్డు ఛార్జింగ్‌కు మద్దతుతో 5,800mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లకు మద్దతు ఇస్తుందని తెలుస్తోంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు