Nissan Motor Lay Offs: ఉద్యోగులకు బిగ్ షాక్.. ఒకేసారి 20 వేల మంది ఔట్

నిస్సాన్ మోటార్ ఒకేసారి 20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనాల్లో అమ్మకాలు తగ్గడంతో కంపెనీ ఆదాయం 94 శాతానికి పడిపోయింది. ఈ క్రమంలోనే 15 శాతం ఉద్యోగస్థులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

New Update
Nissan Motors

Nissan Motors

Nissan Motor Lay Offs: కరోనా నుంచి లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ లేఆఫ్స్ ఎక్కువగా ఐటీ(IT Jobs) రంగంలో ఉండేవి. ఇప్పుడు ఆటో సెక్టారుకు చెందిన నిస్సాన్ మోటార్ ఒకేసారి 20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. మొదట 9 వేల మంది ఉద్యోగాలను తొలగించాలని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు దానికి 11 వేల మందిని యాడ్ చేసింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

అమ్మకాలు భారీగా తగ్గడం వల్లనేే..

ఒకేసారి ఇన్ని వేల మంది ఉద్యోగస్థులను తొలగించడానికి ముఖ్య కారణం.. అమెరికా, చైనాల్లో అమ్మకాలు తగ్గడమే. కంపెనీ ఆదాయం 94 శాతం వరకు పడిపోయింది. ఈ క్రమంలోనే 15 శాతం మంది ఉద్యోగస్థులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

Advertisment
తాజా కథనాలు