/rtv/media/media_files/3BXMV2CedYmao1iUk39N.jpg)
మామూలుగా అయితే శనివారం స్టాక్ మార్కెట్ ఉండదు. కానీ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో స్టాక్ మార్కెట్ ఈరోజు కూడా ఓపెన్ అయింది. మొదలయినప్పుడు స్వల్ప లాభాలతో ఉన్న సూచీలు ప్రస్తుతం ఒడిదుడుకుల్లో కదలాడుతున్నాయి. బడ్జెట్ లో ఏం చప్తారో అన్న సందేహంతో మదుపర్లు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 77,625 దగ్గరా.. నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 23,535 దగ్గరా కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, జొమాటో, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ హోటల్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టైటాన్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 35 పెరుగుతుండగా..15 స్టాక్స్ క్షీణిస్తున్నాయి. NSE సెక్టోరల్ ఇండెక్స్ యొక్క రియల్టీ రంగం అత్యధికంగా 0.73% పెరిగింది.
దూకుడుగా ఐటీ, చమురు, గ్యాస్..
బడ్జెట్ కు ముందు, ఐటీ, చమురు, గ్యాస్ రంగాలు మినహా అన్ని రంగాల సూచీలు చాలా వేగంగా ట్రేడవుతున్నాయి. రియల్టీ రంగం అత్యధికంగా 0.73 శాతం పెరిగింది. ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలలో 0.06% క్షీణత ఉంది. ఇక బడ్జెట్‌కు ముందు రోజు విదేశీ పెట్టుబడిదారులు ₹1,188.99 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం జనవరి 31న విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ.1,188.99 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇదే దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.2,232.22 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Also Read: Budget 2025: నిర్మలమ్మ ఎనిమిదవ బడ్జెట్ 2025..వరాలా?వాతలా?