Mothers Day 2025 Offers: మదర్స్ డే స్పెషల్.. కిక్కెక్కె రీఛార్జ్ ఆఫర్లు - భారీగా డిస్కౌంట్

మదర్స్ డే 2025కి ముందు BSNL 3 రీఛార్జ్ ప్లాన్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటింది. రూ.599ల రీఛార్జ్ ప్లాన్‌ ధరను రూ.569లకు తగ్గించారు. అలాగే రూ.997ల రీఛార్జ్ ప్లాన్‌‌ను రూ.947కు తగ్గించారు. రూ.2399ల ధరను రూ.2279లకు తగ్గించారు. మే 14 వరకు ఈ ఆఫర్ ఉంటుంది.

author-image
By Seetha Ram
New Update
Mother Day 2025 Offers

Mother s Day 2025 Offers

మరో రెండు రోజుల్లో మదర్స్ డే వేడుక జరగనుంది. ఆదివారం (మే 11)న మదర్స్ డేను జరుపుకోనున్నారు. ఈ తరుణంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మదర్స్ డే కి ముందు BSNL ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్ ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు తక్కువ ధరలకే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. బిఎస్ఎన్ఎల్ 3 దీర్ఘకాలిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని మే 11 ఆదివారం నుండి మే 14 వరకు పొందవచ్చు. ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

3 రీఛార్జ్ ప్లాన్‌లపై తగ్గింపు

రూ.599 ల రీఛార్జ్ ప్లాన్‌ను రూ.569లకు తగ్గించారు.
రూ.997 ల రీఛార్జ్ ప్లాన్‌ను రూ.947కు తగ్గించారు.
రూ.2399ల ప్లాన్‌ను రూ.2279 లకు తగ్గించారు.
ఈ మూడు రీఛార్జ్ ప్లాన్‌ల ధరపై 5 శాతం తగ్గింపును కంపెనీ అందించింది. ఈ ఆఫర్‌ను BSNL తన అధికారిక వెబ్‌సైట్, సెల్ఫ్-కేర్ మొబైల్ యాప్‌లో వెల్లడించింది. 

Also Read :  ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు

రూ.569 ప్లాన్ ప్రయోజనాలు

రూ.599కి బదులుగా రూ.569కి రీఛార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, 3GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో BiTV కి ఉచిత యాక్సెస్ కూడా అందుబాటులో ఉంది. 

ఇది కూడా చూడండి: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

రూ.947 ప్లాన్ ప్రయోజనాలు

రూ.997 రీఛార్జ్ ప్లాన్ రూ.947 కు లభిస్తుంది. ఈ మిడ్-రేంజ్ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు, డైలీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. దీనితో పాటు BiTV సబ్‌స్క్రిప్షన్ కూడా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. 

 ఇది కూడా చూడండి: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

రూ.2279 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

రూ.2399కి బదులు రూ.2279కి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMSలు, ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 350+ లైవ్ టీవీ ఛానెల్‌లను చూడటానికి BiTV సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం.

BSNL New Recharge Plan | bsnl offers | latest-telugu-news | telugu-news

 

Advertisment
Advertisment
తాజా కథనాలు