March Upcoming Smartphones: కిక్కే కిక్కు.. ఈ నెలలో ఫోన్ల జాతరే- ఒకటి కాదు రెండు కాదు ఏకంగా!

మార్చి నెలలో భారత మార్కెట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు లాంచ్ కానున్నాయి. Nothing Phone(3a), Samsung Galaxy A36, iQoo Neo 10R ఫోన్లు రిలీజ్ అవుతాయి. వీటితోపాటు Xiaomi 15 Ultra, Vivo T4x, Poco M7 5G, Honor X9c వంటి ఫోన్లు ఈనెలలో పరిచయం కానున్నాయి.

New Update
March Upcoming Smartphones

March Upcoming Smartphones

మార్చి నెల స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ నెలలో అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీలు, అదిరిపోయే కెమెరా సెన్సార్లు, సరికొత్త ప్రాసెసర్‌లతో కూడిన అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ నెలలో వస్తున్న నథింగ్, శామ్‌సంగ్, వివో వంటి ప్రధాన బ్రాండ్‌ల ఫోన్‌ల జాబితాను తెలుసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

March Upcoming Smartphones

Nothing Phone (3a):

నథింగ్ కంపెనీ నుంచి వచ్చిన పలు మోడళ్లు ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఫీచర్లు పరంగా, ధర పరంగా కూడా ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేశాయి. ఇక కంపెనీ ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను మార్కెట్‌లో పరిచయం చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ (3a)ను లాంచ్ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను మార్చి 4న లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లేను పొందవచ్చు. అలాగే Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ ఇందులో అందించబడింది. ఇందులో గరిష్టంగా 12GB RAM ఇవ్వబడింది. ఫోటోగ్రఫీ కోసం.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!

Samsung Galaxy A36

శాంసంగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే కంపెనీ మరో మోడల్‌ను మార్చిలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇవాళ Samsung Galaxy A36ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 లేదా 7s జెన్ 2 ప్రాసెసర్ అందించారు. అలాగే 6.6-అంగుళాల FHD-AMOLED డిస్‌ప్లే, 8-మెగాపిక్సెల్, 5-మెగాపిక్సెల్ వెనుక కెమెరా లెన్స్‌లతో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అందించారు. ఇక ఫోన్‌కి శక్తిని ఇవ్వడానికి 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5000mAh బ్యాటరీని అందించారు. 

ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !

iQoo Neo 10R

మార్చిలో లాంచ్ కానున్న మరోక ఫోన్ iQoo Neo 10R. ఈ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా గేమింగ్ కోసం రూపొందించబడింది. దీనిలో 6000mm2 వేపర్ కూలింగ్ చాంబర్, 2000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. పవర్ బ్యాకప్ కోసం ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6,400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ధర రూ. 25,000 వరకు ఉంటుంది.

వీటితో పాటు Xiaomi 15 Ultra, Vivo T4x, Poco M7 5G, Honor X9c వంటి ఫోన్లు ఈనెలలో లాంచ్ కానున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు