Solar laptop: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న సోలార్‌ ల్యాపీ.. వచ్చేది ఎప్పుడంటే?

ప్రముఖ కంపెనీ లెనోవా సోలార్‌తో పనిచేసే ల్యాపీని త్వరలో మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. చూడటానికి సాధారణ ల్యాపీలానే ఉన్నా దీని వెనుక ప్యానెల్ మాత్రం సౌరశక్తిని సంగ్రహించేలా ఏర్పాటు చేశారు. అయితే ఇది ఔట్‌డోర్‌లో పనిచేసే వారికి బాగా ఉపయోగపడుతుంది.

author-image
By Kusuma
New Update
Solar Lapi

Solar Lapi Photograph: (Solar Lapi)

రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతుంది. కొత్త టెక్నాలజీతో రకరకాల గ్యాడ్జెట్లు వస్తున్నాయి. అయితే ప్రముఖ కంపెనీ లెనోవా సోలార్‌తో పనిచేసే ల్యాపీని త్వరలో మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ప్రస్తుతం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో లెనోవా ఈ ల్యాపీని ప్రదర్శించింది. ఈ ల్యాపీ చూడటానికి సాధారణంగానే ఉంటుంది. కానీ దీని వెనుక ప్యానెల్ మాత్రం సౌరశక్తిని సంగ్రహించేలా ఏర్పాటు చేశారు. బ్యాక్‌ కాంటాక్ట్‌ సెల్‌ సాంకేతికతతో వస్తున్న ఈ ల్యాపీని ఎండలో కేవలం 20 నిమిషాల ఉంచితే.. గంట సేపు వీడియోను ప్లే బ్యాక్‌ చేయవచ్చు. ఈ ల్యాపీ ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 

ఇది కూడా చూడండి: హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!

ఇది కూడా చూడండి: Gas cylinder exploded : కూకట్‌పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు

మొదటి సోలార్ ల్యాప్ ఇదే..

విద్యుత్‌పై అందరూ ఆధారపడుతున్నారు. దీన్ని తగ్గించడం కోసమే ఈ ల్యాపీని తీసుకొస్తున్నట్లు లెనోవా తెలిపింది. ప్రపంచమంతా కూడా సోలార్ వైపు వెళ్తుంది. ఈ క్రమంలోనే ఇలాంటి ల్యాపీని తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. ఈ ల్యాపీ 15mm మందం, 1.22 కిలోల బరువు ఉంటుంది. అయితే ప్రపంచంలో మొదటి అల్ట్రా స్లిమ్ సోలార్‌ ల్యాపీ ఇదే. అయితే ఇది మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కచ్చితంగా కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ వచ్చినా ఔట్ డోర్‌లో పనిచేసే వారికే బాగా ఉపయోగపడుతుంది. 

ఇది కూడా చూడండి: World Obesity Day 2025: పెరుగుతున్న ఊబకాయం.. ఈ అలవాట్లు మానకుంటే ప్రమాదాలు తప్పవు!

ఇది కూడా చూడండి: Champions Trophy: మూడు ఓవర్లలో నాలుగు పరుగులు, ఒక వికెట్.. ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు