World Obesity Day 2025: పెరుగుతున్న ఊబకాయం.. ఈ అలవాట్లు మానకుంటే ప్రమాదాలు తప్పవు!

ప్రతీ సంవత్సరం మార్చి 4న ప్రపంచ ఊబకాయ దినోత్సవం జరుపుకుంటారు. ప్రజల్లో ఊబకాయం గురించి అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం, అధిక కేలరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఊబకాయం సమస్యకు దారితీస్తాయి.

New Update
world obesity day 2025

world obesity day 2025

World Obesity Day 2025: నేటి బిజీ లైఫ్ లో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కుంటున్నారు. ఇటీవలే మంకీబాత్ కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ ఒబెసిటీని అధికమించేందుకు పిలుపునిచ్చారు. fight obesity అనే హ్యాష్ ట్యాగ్ తో ఒబేసిటీ పై పోరాటాన్ని ప్రారంభించారు.  అయితే ప్రతీ సంవత్సరం మార్చి 4న ప్రపంచ ఊబకాయ దినోత్సవం జరుపుకుంటారు. ప్రజల్లో ఊబకాయం గురించి అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఒక నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.  అధిక బరువు గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.ఈరోజు ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా ఊబకాయానికి గురి చేసే 5 ఆరోగ్యకరమైన అలవాట్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.. 

భోజనం దాటవేయడం

సాధారణంగా బరువు తగ్గడానికి చాలా మంది డైటింగ్ లేదా భోజనం మానేయడం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా బరువు తగ్గడం చాలా సువులు అని భావిస్తారు. కానీ ఇది పనిచేయదు. నిజానికి రోజంతా డైటింగ్ తర్వాత, భోజనం చేసేటప్పుడు ఆకలిని తీర్చుకోవడానికి మీరు కావాల్సిన అవసరమైన దానికంటే ఎక్కువ తింటారు. దీని కారణంగా జీవక్రియ మందగించి.. శరీరంలో కేలరీలు మరింత  పెరిగిపోతాయి. బరువు తగ్గడం కష్టం అవుతుంది. 

వ్యాయామాలు 

బరువు తగ్గాలనుకునే వారికి ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యమైనది. ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా శరీరంలో కొవ్వును కరిగించవచ్చు. 

స్వీట్స్ 

చక్కర, స్వీట్లలో కేలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం  ఊబకాయం సమస్యను పెంచుతుంది. అలాగే ఆహారంలో నూనెలు కూడా తక్కువగా తీసుకోవాలి. 

నిద్రలేమి 

ఊబకాయం సమస్యకు నిద్రలేని కూడా ఒక ప్రధాన కారణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ 6-7 గంటలు నిద్రపోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. తద్వారా  బరువు తగ్గడం సులభం అవుతుంది. తగినంత నిద్ర లేకపోవడం , ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుందని అనేక పరిశోధనలు కనుగొన్నాయి.

పండ్ల రసాలు

సహజంగా పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివని భావిస్తారు. కానీ పండ్ల రసాలు  శరీరానికి అదనపు కేలరీలను అందిస్తాయి. తద్వారా బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే పోషకాహార నిపుణులు పండ్ల రసాలకు బదులుగా మొత్తం పండును తినమని సూచిస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు