/rtv/media/media_files/2025/01/31/McCGl4oz3DtF4IeyhxaG.jpg)
Jio Affordable Value Pack rs 189 available
ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో తొలగించిన తన చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో యూజర్లకు ఎంతో ఫేవరెట్ అయిన రూ.189 రీఛార్జ్ ప్లాన్‌ని మళ్లీ అందించి సర్‌ప్రైజ్ చేసింది. దీని కోసం ‘అఫోర్డబుల్ ప్యాక్స్’ అని ఒక కొత్త సెక్షన్ తీసుకొచ్చింది. ఈ సెక్షన్‌లోనే రూ.189 ప్లాన్ యాడ్ చేసింది.
రూ.189 రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్
ఇక ఈ ప్లాన్ బెనిఫిట్స్ వివరాల విషయానికొస్తే.. ఈ రూ.189 రీఛార్జ్ ప్లాన్‌లో యూజర్లు 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లో మొత్తం 2జీబీ డేటా లభిస్తుంది. ఇంకా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందుతారు. అంతేకాకుండా 300 ఎస్ఎమ్ఎస్‌లు కూడా ఫ్రీగా పొందొచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఎక్స్‌ట్రా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ ఫ్రీగా వాడుకోవచ్చు.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
బడ్జెట్-ఫ్రెండ్లీ వాయిస్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి.. ఇది ప్రస్తుతం Jio నుంచి అత్యల్ప ధర గల వాయిస్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత రూ.199 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌లో 18 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. డైలీ 1.5జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకి 100 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో డేటా ఎక్కువ ఇచ్చినా.. వ్యాలిడిటీ మాత్రం తక్కువ అనే చెప్పాలి.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
ఇదిలా ఉంటే ఇందులోని రూ.1,958 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.1,748లకే అందుబాటులో ఉంది. దీని వ్యాలిడిటీలో మార్పులు వచ్చాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఇప్పుడు 336 రోజులకు తగ్గించారు. దీనితో పాటు రూ.458 ప్లాన్‌ను రూ.448కి సర్దుబాటు చేశారు. కానీ ఇందులో వ్యాలిడిటీ తగ్గించలేదు. 84 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది.
Also Read : ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!