Jio 9th Anniversary Offers: జియో మామ సర్‌ప్రైజ్.. ఒక నెల రీఛార్జ్ ఫ్రీ - 9వ యానివర్సరీ ఆఫర్ అదిరింది..!

రిలయన్స్ జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. 50 కోట్ల వినియోగదారుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా 5G కస్టమర్లకు మూడు రోజుల పాటు అపరిమిత డేటా అందిస్తోంది. అలాగే, రూ.349 అంతకంటే ఎక్కువ ప్లాన్లపై ఒక నెల ఉచితంగా అందిస్తోంది.

New Update
Jio 9th Anniversary Offers

Jio 9th Anniversary Offers

Jio 9th Anniversary Offers: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కనీ విని ఎరుగని రీతిలో కస్టమర్లను తనవైపుకు తిప్పుకుంది. కొత్త కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను అట్రాక్ట్ చేసింది. జియో లాంచ్ అయి నేటికి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 9 ఏళ్లలో కంపెనీ ఎంతో మంది సబ్‌స్రైబర్లను సంపాదించుకుని మిగతా కంపెనీలను వెనక్కి నెట్టింది. 

Also Read: షాకింగ్ వీడియో: ఊరేగింపులో పాములతో డ్యాన్సులు.. చివరికి..!

Jio 9th Anniversary Offers

తాజాగా రిలయన్స్ జియో కంపెనీ అదిరిపోయే అనౌన్స్‌మెంట్ చేసింది. ఇప్పటికి 50 కోట్ల వినియోగదారుల మార్కును దాటినట్లు ప్రకటించింది. నేటితో (సెప్టెంబర్ 5) జియో 9వ వార్సికోత్సవం సందర్భంగా కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విజయంతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా నెట్‌వర్క్‌గా అవతరించింది. కంపెనీ ప్రకారం.. జియో వినియోగదారుల సంఖ్య ఇప్పుడు US, UK, ఫ్రాన్స్‌ల జనాభాను మించిపోయిందని తెలిపింది. అంతేకాకుండా జియో తన 9వ వార్షికోత్సవం సందర్భంగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే ప్రత్యేక ఆఫర్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read:కూతురి ఇంజినీరింగ్‌ ఫీజు కోసం.. తల్లి దొంగతనం

జియో 9వ వార్షికోత్సవ ఆఫర్

టెలికాం సంస్థ జియో ఇప్పుడు 9వ యానివర్సరీ వేడుక సందర్భంగా అదిరిపోయే రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగానే రూ.349 నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌లను కలిగి ఉన్న కస్టమర్లకు నేటి (సెప్టెంబర్ 5) నుండి అక్టోబర్ 5 వరకు అంటే ఒక నెలపాటు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ధర గల రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉన్న 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ అపరిమిత 5G డేటా అందుబాటులో ఉంటుంది.

Also Read:Crime news: కసాయి పనికి ఒడిగట్టిన కన్న తండ్రి.. ముగ్గురు పిల్లల్ని చంపి తాను కూడా చివరికి..

ఇది మాత్రమే కాకుండా జియో మరో అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. యాక్టివ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా.. అన్ని 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సెప్టెంబర్ 5 నుండి 7 వరకు వారాంతాల్లో అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటాను అందిస్తుంది. అదే సమయంలో కంపెనీ 4G వినియోగదారులకు రూ.39లకే అపరిమిత డేటాను ప్రకటించింది. దీని గరిష్ట పరిమితి 3GB వరకు మాత్రమే. 

అలాగే జియో రూ.349 ప్రత్యేక సెలబ్రేషన్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్, జియోసావ్న్ ప్రో, జొమాటో, నెట్‌మెడ్స్, రిలయన్స్ డిజిటల్, AJIO, EaseMyTrip వంటి ప్లాట్‌ఫామ్‌లపై రూ.3,000 సబ్‌స్క్రిప్షన్ వోచర్ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సెలబ్రేషన్ ప్లాన్‌లో వరుసగా 12 రీఛార్జ్‌లను పూర్తి చేసిన కస్టమర్‌లకు 13వ నెల ఉచితంగా లభిస్తుందని కంపెనీ తెలిపింది. 

అలాగే హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ కూడా ఒకటుంది. ఇందులో మీరు రూ.1,200కి రెండు నెలల జియోహోమ్ కనెక్షన్‌ను పొందుతారు. ఈ కనెక్షన్‌లో 1,000 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్, అపరిమిత డేటా, 12 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ లభిస్తుంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్, డిజిటల్ గోల్డ్ రివార్డులు కూడా ఉన్నాయి. జియో తన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏడాది పొడవునా కొత్త సేవలను ప్రారంభిస్తామని తెలిపింది.

Advertisment
తాజా కథనాలు