Infosys Jobs: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్..ఇన్ఫోసిస్లో భారీగా ఉద్యోగాలు!

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.  2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జయేష్ వెల్లడించారు.  

New Update
infosyis frehers

infosyis frehers

Infosys Jobs: 400 మంది ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసేసిన భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.  2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జయేష్ వెల్లడించారు.  

Also Read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!

2025 ఆర్థిక సంవత్సరానికి 15,000 నుండి 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇక శాలరీ హైక్ ల గురించి ఆయన మాట్లాడుతూ..  కంపెనీలో జీతాల పెంపు సగటున 5-8% శాతం ఉందన్నారు. మంచిగా పనిచేసిన వారికి 10-12%శాతం పెంచామని అన్నారు.  జనవరిలోనే చాలామందికి శాలరీలు పెరిగాయని..  మిగితా వారికి 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

Also Read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

ఉద్యోగుల తొలగింపు రేటు కూడా

 అయితే, గత 12 నెలలుగా ఇన్ఫోసిస్ ఉద్యోగుల తొలగింపు రేటు కూడా డిసెంబర్ 2024 త్రైమాసికంలో 13.7% నుండి 14.1%కి పెరిగింది. కాగా ఇన్ఫోసిస్ మైసూర్ బ్రాంచ్ లో 400 మంది ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసేసింది.  వీరంతా 2024 అక్టోబర్ లో కంపెనీలో చేరారు, కానీ ఉద్యోగంలో కొనసాగడానికి అవసరమైన పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోయారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు