ఆఫర్ అరాచకం.. ఐఫోన్ 15 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్..!

ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ప్రో ఫోన్‌పై కళ్లు చెదిరే తగ్గింపు అందుబాటులో ఉంది. బేస్ మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్‌‌ను రూ.30,410 ఫ్లాట్ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

New Update
iPhone 15 Pro

ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ అధిక ధర కారణంగా చాలా మంది కొనుక్కునేందుకు వెనక్కి జంకుతున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.  ఇప్పుడు భారీ తగ్గింపుతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇటీవల ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ తమ కొత్త సేల్‌ను ప్రకటించి ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి: పండగ పూట భారీగా షాక్‌ ఇచ్చిన పుత్తడి...ఎంత పెరిగిందంటే!

ఇక ఇప్పుడు మరొక ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్ విజయ్ సేల్స్ ఐఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఐఫోన్ 15 ప్రో ఫోన్‌పై కళ్లు చెదిరే తగ్గింపు అందిస్తుంది. కాగా iPhone 15 Pro ఫోన్ మొత్తం 4 వేరియంట్లలో వచ్చింది. అందులో 128GB, 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, A17 ప్రో చిప్‌సెట్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. 

iPhone 15 Pro Offer

విజయ్ సేల్స్ ఆఫర్‌లో భాగంగా.. iPhone 15 Proలోని బేస్ మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దాదాపు రూ.30,410 ఫ్లాట్ తగ్గింపుతో విజయ్ సేల్స్ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ చేయబడింది. ఐఫోన్ 15 ప్రో అసలు  ధర రూ.1,34,900 ఉండగా ఇప్పుడు ఈ భారీ తగ్గింపుతో దీనిని కేవలం రూ. 1,04,490కి కొనుక్కోవచ్చు. ఈ ధర వైట్, బ్లాక్ కలర్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. 

ఇది కూడా చదవండి: ఓలా బంపరాఫర్.. చీప్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్!

ఇది మాత్రమే కాకుండా విజయ్ సేల్స్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 7.5% (రూ. 4,500 వరకు) అదనపు తగ్గింపు పొందొచ్చు. అలాగే HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIపై 7.5% (రూ. 5,000 వరకు) లభిస్తుంది.

అదే సమయంలో YES బ్యాంక్, IDFC FIRST బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, RBL, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, DBS బ్యాంక్ కార్డ్‌లపై కూడా 5-10 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కార్డ్‌లలో నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు