Gold Price: పండగ పూట భారీగా షాక్ ఇచ్చిన పుత్తడి...ఎంత పెరిగిందంటే! హైదరాబాద్ లో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై వరుసగా రూ. 200, రూ. 700, రూ. 50 చొప్పున పడిపోగా.. ఇప్పుడు మళ్లీ భారీగా పెరిగింది. ప్రస్తుతం తులం గోల్డ్ రేట్ రూ. 700 పెరిగి రూ. 70,950 కి చేరింది.వెండి ధర తాజాగా రూ. 2 వేలు పెరిగి కిలోకు రూ. 1,02,000 వద్ద ఉంది. By Bhavana 12 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Gold Prices: పండుగలతో పాటు...పెళ్లిళ్ల ముహుర్తాలు కూడా మొదలు అయ్యాయి. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువ అయ్యాయి. అందుకే బంగారం డిమాండ్ కూడా భారీగా పెరిగింది. డిమాండ్‌ను బట్టే.. రేట్లు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. ఇటీవల దేశీయంగా.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటనల్లో.. గోల్డ్, సిల్వర్ వంటి లోహాలపై కస్టమ్స్ డ్యూటీ భారీగా తగ్గించగా.. రేట్లు కొద్దిగా దిగొచ్చాయి. Also Read: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. అప్పటి నుంచి బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సడెన్‌గా రేట్లు మళ్లీ గరిష్టాలకు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో హైదరాబాద్ లో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై వరుసగా రూ. 200, రూ. 700, రూ. 50 చొప్పున పడిపోగా.. ఇప్పుడు మళ్లీ భారీగా పెరిగింది. Also Read: దసరా వేళ తప్పిన భారీ ప్రమాదం! ప్రస్తుతం తులం గోల్డ్ రేట్ రూ. 700 పెరిగి రూ. 70,950 కి చేరింది. ఇదే 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. రూ. 760 పెరిగి 10 గ్రాములకు రూ. 77,400 వద్ద ఉంది. Also Read: తమిళనాడు రైలు ప్రమాదం..18 రైళ్లు రద్దు! దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై రూ. 700 పెరిగి 10 గ్రాములు రూ. 71,100 పలుకుతోంది. మరోవైపు 24 క్యారెట్ల పసిడి ధర రూ. 760 పెరిగి తులం రూ. 77,550 వద్ద ఉంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ. 2000 పెరిగి ప్రస్తుతం రూ. 96 వేల మార్కుకు చేరింది. దీనికి ముందు వరుసగా రూ. 1000, రూ. 2 వేల చొప్పున తగ్గింది. హైదరాబాద్ నగరంలో చూస్తే.. వెండి ధర తాజాగా రూ. 2 వేలు పెరిగి కిలోకు రూ. 1,02,000 వద్ద ఉంది. Also Read: రతన్ టాటా డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో చూడవచ్చంటే? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి