ఓలా బంపరాఫర్.. చీప్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్! ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ‘BOSS 72-hour Rush’ ప్రారంభించింది. దీని ద్వారా కొత్త ఈవీ కొనుక్కోవాలనుకునే వారికి రూ. 30,000 విలువైన బెనిఫిట్స్‌ను అందిస్తుంది. ఇది అక్టోబర్ 10 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. By Seetha Ram 11 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తాజాగా ‘BOSS 72-hour Rush’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త ఈవీ కొనుక్కోవాలనుకునే వారికి రూ. 30,000 విలువైన బెనిఫిట్స్‌ను అందిస్తుంది. ఈ సూపర్ స్పెషల్ ఆఫర్.. అక్టోబర్ 10 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. అంటే 72 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.30,000 తగ్గింపు ఈ ఆఫర్‌లో భాగంగా కస్లమర్లు S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.25 వేలు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత స్కూటర్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అంటే మొత్తం రూ.30,000 లభిస్తుందన్నమాట. ఇది కాకుండా BOSS 72-hour Rush కింద రూ. 7,000 విలువ చేసే 8 ఏళ్లు లేదా 80,000 కి.మీ బ్యాటరీ వారంటీ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తామని ఓలా తెలిపింది. ఇది కూడా చదవండి: వన్‌ప్లస్ నుంచి తోపు ఫోన్.. బ్యాటరీ హైలైట్! ఇది మాత్రమే కాకుండా ఫైనాన్సింగ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌లపై రూ.5,000 వరకు స్పెషల్ డిస్కౌంట్ పొందొచ్చు. అదనంగా రూ. 6,000 విలువైన MoveOS+ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ఫ్రీగా లభిస్తుంది. ఇంకా రూ.7,000 వరకు ఫ్రీ రీఛార్జింగ్ క్రెడిట్లు కూడా లభిస్తాయి. రూ.49,999లకే ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా ‘బాస్ 72-అవర్ రష్’ సేల్‌లో ఓలా S1 X 2kWh వేరియంట్‌ను రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇకపోతే ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 సిరీస్‌లో మొత్తం 6 మోడళ్లు ఉన్నాయి. అందులో ప్రీమియం S1 ప్రో రూ.1,34,999 ధరతో లభిస్తుంది. అదే సమయంలో S1 ఎయిర్ రూ.1,07,499లకి.. S1 X 2 kWh రూ.74,999లకి.. 3 kWh రూ.87,999లకి.. 4 kWh రూ.1,01,999లకి కొనుక్కోవచ్చు. #best-offers #electric-scooter #ola-electric మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి