/rtv/media/media_files/2025/11/04/ai-2025-11-04-11-00-48.jpg)
సాంకేతిక రంగంలో మరో ముందడుగు పడింది. భారత్ లో సెమీకండక్టర్ల తయారీ, ఎడ్జ్-ఏఐ చిప్ హార్డ్‌వేర్ డిజైన్‌ను సహ-అభివృద్ధి చేయడం కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (BCSSL) కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఒక అత్యాధునిక సాంకేతిక సంస్థతో $150 మిలియన్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1,250 కోట్ల పైగా విలువైన కీలక టెక్నాలజీ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Blue Cloud Softech Solutions: Signs $150 Million Or 13.3b Rupees Agreement With Israeli Tech Firm To Develop Edge-ai Chip Hardware And Manufacture Semiconductors In India; Co Mcap 650 Cr Rupees
— JS Chanan (@jschanan) November 4, 2025
ఐదేళ్ల వ్యూహాత్మక పెట్టుబడి
ఈ 150 మిలియన్ డాలర్ల ఒప్పందంలో BCSSL ఐదేళ్ల వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక కూడా ఉంది. ఇది భారత్ లో టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఉత్పత్తి అభివృద్ధి, తయారీ ఏర్పాటు వంటి కీలక అంశాలను కవర్ చేస్తుంది. అదనంగా, హార్డ్‌వేర్ డిజైన్ బదిలీ. మేధో సంపత్తి హక్కుల కోసం ఇజ్రాయెల్ టెక్నాలజీ భాగస్వామికి రాబడి వాటా కూడా చెల్లిస్తారు.
ఈ వ్యూహాత్మక కొనుగోలు ద్వారా బ్లూ క్లౌడ్ సోఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థ తమ టెక్నాలజీ సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త సాంకేతికత, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కీలక రంగాలలో సంస్థకు పోటీ ప్రయోజనాన్ని చేకూర్చనుంది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇజ్రాయెల్ నుంచి సాంకేతికతను కొనుగోలు చేయడం అనేది బ్లూ క్లౌడ్ సోఫ్టెక్ సొల్యూషన్స్‌కు గేమ్ ఛేంజర్ లాంటిది.
ఇజ్రాయెల్ సంస్థలు ముఖ్యంగా రక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానానికి ప్రసిద్ధి చెందాయి. ఈ డీల్ సంస్థ భవిష్యత్తు వృద్ధికి, గ్లోబల్ మార్కెట్‌లో స్థానం పెంపుదలకు దోహదపడుతుందని వారు అంచనా వేస్తున్నారు.
Follow Us