SIP: సిప్‌లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలోనే మీరు కోటీశ్వరుడు కావడం ఖాయం!

సిప్‌లో నెలకు రూ.25 వేలు 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రిటర్న్ రూ.4.97 కోట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే సిప్ లేకుండా ప్రతీ నెల ఇన్వెస్ట్ చేస్తే రూ.60 లక్షలు అవుతుంది. మొత్తం రిటర్న్ కేవలం రూ.2.3 కోట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు.

New Update
SIP

SIP

మనలో చాలా మందికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) గురించి పెద్దగా తెలియదు. కానీ ఇందులో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆనతి కాలంలో లాభాలు సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సిప్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలాగో చాలా మందికి తెలియదు. అసలు ఈ సిప్‌లో ఎలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి? తక్కువ చేయాలా? ఎక్కువ చేయాలా? తొందరగా లాభాలు కావాలంటే సిప్‌లో ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుకేయాల్సిందే.

ఇది కూడా చూడండి: Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. ఎన్నడూ లేనంత బోనస్‌!

తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌కు చెందినది. ఇందులో ప్రతీ నెలా ఒక నిర్ణీత మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలు పెద్దగా ఉండవు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి తక్కువ లేదా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు మీరు నెలకు రూ. 25 వేలతో సిప్ మొదలు పెట్టారని అనుకోండి. దీనిపై 10 శాతం ప్రతీ ఏడాది పెంచుకుంటూ వెళ్లాలి. ఒకవేళ మీ పెట్టుబడిపై అంచనా రిటర్న్ 12% ఉంటే మాత్రం కేవలం 20 ఏళ్లలోనే మొత్తం పెట్టుబడి రూ.1.72 కోట్లు అవుతుంది. కానీ మీకు ఈ సిప్‌లో మొత్తం రిటర్న్ దాదాపుగా రూ.4.97 కోట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే మీరు స్టెప్ అప్ అంటే సిప్ లేకుండా ప్రతీ నెల రూ.25 వేలు 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.60 లక్షలు అవుతుంది. మీకు మొత్తం రిటర్న్ కేవలం రూ.2.3 కోట్లు మాత్రమే వస్తుంది. వీటిని బట్టి చూస్తే సిప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. 

మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?

కొందరికి ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలనే విషయం సరిగ్గా తెలియదు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు వాటి పనితీరు ఎలా ఉందనే విషయం తెలుసుకోవాలి. అంటే గత 5 నుంచి 10 సంవత్సరాల వరకు మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్‌ను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే డెట్-ఓరియెంటెడ్ స్కీమ్స్ కన్నా ఈక్విటీ ఫండ్స్ త్వరగా పెరుగుతాయి. వీటివల్ల త్వరగా లాభాలు వస్తాయి. ఇలాంటి వాటిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీర్ఘకాలికం నుంచి ఏ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో తెలుసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. 

మధ్యలోనే ఆపవద్దు

కొందరు మార్కెట్ హెచ్చు తగ్గులకు భయపడి సిప్‌ను మధ్యలోనే ఆపేస్తారు. అయితే మార్కెట్ అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. నష్టాలు, లాభాలు వంటివి సహజం. అయితే మార్కెట్ పడిపోయిందని భయపడి సిప్‌ను మధ్యలోనే ఆపితే మీకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. లాస్‌లో మార్కెట్ నడుస్తుందని తక్కువ ధరకే యూనిట్లను అమ్మడం వంటివి చేయకూడదని చెబుతున్నారు. అయితే సిప్‌లో ఎప్పుడూ కూడా తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయడం వల్ల దీర్ఘకాలంలో పెట్టుబడులపై మీకు రిటర్న్ పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Stock Market: ఊపుమీదున్న బజాజ్, రిలయెన్స్ షేర్లు..వరుసగా నాలుగో రోజులు లాభాల్లో మార్కెట్

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు