/rtv/media/media_files/2025/03/12/pIP0DF2jSW6FqniRuitm.jpg)
Indus Ind Bank
ప్రపంచం మొత్తం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఈదులాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో రోజూ ఎత్తుపల్లాలను చూస్తున్నాయి. ఈ క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా ప్రవైట్ బ్యాంకు అయిన ఇండస్ ఇండ్ లాంటివి అయితే దివాలా దిశగా పరుగులు తీస్తున్నాయి. నిన్న మంగళవారం ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు 27శాతం పడిపోయాయి. సోమవారం 5శాతంతో మొదలైన షేర్ల పతనం నిన్న 27కు వరకు దిగజారిపోయాయి. దీంతో ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ 27.06% తగ్గి 52 వారాల కనిష్ట స్థాయి రూ.656కి NSEలో పడిపోయింది. ఒకప్పుడు రూ.1,576 ధర ఉన్న షేరు రూ.656కి పడిపోయింది.
బ్యాంకులో రూ.1, 577 కోట్ల అవకతవకలు..
లాస్ట్ ఏడాదిగా ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు పడిపోతూనే ఉన్నాయి. మొత్తంగా ఇప్పటివరకు 40శాతం షేర్ల ధర తగ్గిపోయాయి. దానికి తోడు బ్యాంక్ ఫారెక్స్ డెరివేటివ్ పోర్ట్‌ఫోలియో ఖాతాలలో అవకతవకలు జరిగాయనే వార్త పెట్టుబడిదారులను మరింత ఆందోళనకు గురి చేసింది. ఫారెక్స్ డెరివేటివ్ పోర్ట్‌ఫోలియో ఖాతాలలో దాదాపు రూ.1,577 కోట్ల అవకతవకలు వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాంక్ షేర్లు పతనం కావడం ప్రారంభించాయి. దీంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ క్యాప్ యెస్ బ్యాంక్ కన్నా వెనక్కు వెళ్ళిపోయింది. యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.51,350 కోట్లు దాటగా, ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.51,110 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు యెస్ బ్యాంకు షేర్లు కూడా ఇలానే కనిష్టానికి పతనమయ్యాయి. అవి ఇప్పటివరకూ కోలుకోలేదు. దీన్ని కాపాడటానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు ఇండస్ బ్యాంక్ ది కూడా ఇదే పరిస్థితి అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.
Also Read: USA: టెస్లా కారు కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్