/rtv/media/media_files/2025/07/31/stock-market-losses-2025-07-31-10-25-34.jpg)
ఈ రోజు స్టాక్ మార్కెట్ క్షీణత చూస్తోంది. వారమంతా బలమైన ర్యాలీ తరువాత శుక్రవారం భారత మార్కెట్లు డౌన్ ట్రేడ్ లో ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లు నష్టాల్లో ఉన్నాయి. కానీ అదానీ షేర్లు మాత్రం దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 82,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 25,300 వద్ద ఉంది. ఈరోజు ట్రేడింగ్ లో FMCG, ఆటో స్టాక్ లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. NSE FMCG ఇండెక్స్ 0.50% తగ్గింది, ఆటో ఇండెక్స్ 0.25% తగ్గింది. బ్యాంకింగ్ స్టాక్ లు కూడా కొనుగోళ్లకు దిగుతుండడంతో.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ 0.99% పెరిగింది. బిఎస్ఇలోని టాప్ 30 స్టాక్ లలో, ఏడు మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి. వీటిల్లో అదానీ పోర్ట్స్ అగ్రస్థానంలో ఉంది. కానీ మరోవైపు 23 స్టాక్ లు స్వల్పంగా నష్టపోయాయి. టిసిఎ 1% తగ్గింది.
నష్టాలకు కారణం..
భారత స్టాక్ మార్కెట్ లో లార్జ్ క్యాప్ స్టాక్ లలో క్షీణత కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. లార్జ్ క్యాప్ స్టాక్ లన్నీ అమ్మకాలను ఎదుర్కొంటున్నాయి. దాంతో పాటూ సుంకాలు, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై ఇంకా సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ భారత స్టాక్ మర్కెట్ పై ప్రభావం చూపిస్తున్నాయి. దాని కారణంగానే సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
జైడస్ వెల్నెస్, DCM శ్రీరామ్, జెన్ టెక్నాలజీస్ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. IFCI, ఇండియామార్ట్ , సోనెట్ సాఫ్ట్ వేర్ వంటి స్టాక్స్ కూడా పడిపోయాయి. అదానీ పవర్ షేర్లు 7% పెరిగి 675 కి చేరుకున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు దాదాపు 4% పెరిగాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3%, అదానీ పోర్ట్ 2%, అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా దాదాపు ౩శాతం లాభపడ్డాయి. ఈరోజు బిఎస్ఇలో మొత్తం 3,538 స్టాక్స్ ట్రేడవుతున్నాయి. వాటిలో 1,980 లాభాల్లోనూ, 1,380 నష్టాల్లోనూ ఉన్నాయి. మిగిలిన 178 స్టాక్స్ మారలేదు. 132 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ ను తాకగా, 61 స్టాక్స్ లోయర్ సర్క్యూట్ ను తాకాయి. 87 స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయిల వద్ద, 29 స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా..
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.77% పెరిగి 45,652 వద్ద, కొరియా కోస్పి 0.42% తగ్గి 3,446 వద్ద ముగిశాయి. హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.16% పెరిగి 26,586 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.026% తగ్గి 3,830 వద్ద ముగిసింది. మరోవైపు సెప్టెంబర్ 18న US డౌ జోన్స్ 0.27% పెరిగి 46,142 వద్ద ముగిసింది. నాస్ డాక్ కాంపోజిట్ 0.94% , S&P 500 0.48% లాభపడ్డాయి.
Also Read: Pak-Saudi Deal: పాకిస్తాన్ కు సౌదీ అరేబియా దన్ను..గల్ఫ్ దేశం సైనిక బలం ఎంతో తెలుసా?