/rtv/media/media_files/1eYVbF3J3wXVC1Xcv27m.jpg)
డ్రై ఫ్రూట్స్
డైట్ లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. తరచూ స్ట్రెస్, టెన్షన్స్ తో బాధపడేవారు వీటిని ఆహారంలో చేర్చుకోండి. డ్రై ఫ్రూట్స్ లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో సెరటోనిన్ హార్మోన్ పెంచడంలో సహాయపడతాయి. ఈ హార్మోన్ మానసిక స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. సెరోటోనిన్ అనేది మానసిక ఆరోగ్యానికి సంబంధించినది.
/rtv/media/media_files/2024/10/18/greenleafyvegetables10.jpeg)
బచ్చలికూర
పాలకూర లేదా బచ్చలికూర ఆకుల్లో ఫోలేట్, విటమిన్ బీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక స్థితికి సంబంధించిన మూడ్ రెగ్యులేటింగ్ న్యూరోట్రాన్స్మిటర్లు, సెరోటోనిన్, డోపమైన్లను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. డిప్రెషన్, ఒత్తిడి లక్షణాలతో బాధపడేవారికి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఈ ఆకుకూరలు తోడ్పడతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/oats-jpg.webp)
ఓట్స్ మానసిక స్థితిని ప్రభావితం చేసే షుగర్ స్థాయిలను నిరోధిస్తాయి. వీటిని డైలీ డైట్ లో అల్పాహారంగా తీసుకోవడం మంచి ఎంపిక.
/rtv/media/media_files/2024/10/19/OiaJ7rEzK0I5sq4F7qi1.jpg)
అరటిపండు
సాధారణంగా అరటిపండును స్ట్రెస్ రిలీవర్ అంటారు. అరటిపండులో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సెరోటోనిన్ అనే స్థాయిలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
/rtv/media/media_files/2024/10/20/MadJoW7cSq28Mp5POEzK.jpg)
డార్క్ చాక్లెట్
చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ స్థాయిలను పెంచుతాయి. ఇది డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే చాక్లెట్ ముక్కలను కాఫీలో కరిగించి తినడం లేదా ఓట్స్ లో కలిపి తినవచ్చు.
/rtv/media/media_files/2024/11/25/raisin4.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.