ఇలా చేస్తే వాళ్ళు మిమల్ని అవసరానికి వాడుకుంటున్నారని అర్థం!

ఎదుటివారిని జస్ట్ అవసరాలకు మాత్రమే వాడుకునే వ్యక్తులను కొన్ని సంకేతాల సహాయంతో గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి కింది ఆర్టికల్ పూర్తిగా చదవండి.

New Update
friends (1)

friends

Life Style : ఫ్రెండ్షిప్ లో మూడు రకాల ఫ్రెండ్స్ ఉంటారు. మొదటి కేటగిరీ .. అవసరాల కోసం మాత్రమే స్నేహం చేసేవారు, రెండవ కేటగిరీ నువ్వు సహాయం చేస్తే .. నేను సహాయం చేస్తా, ఇక ఈ చివరి కోవకు చెందిన వారు అసలైన ఆత్మీయులు, స్నేహితులు.. ఏమీ ఆశించకుండా ఎల్లప్పుడూ మనతోనే ఉండేవారు. అయితే ఈ మొదటి కేటగిరీ వ్యక్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారు. స్నేహితుల మనసుల్ని ముక్కలు చేస్తారు. మీకు ఈ పరిస్థితి రాకూడదు అంటే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలంటే ముందు వారు ఎలాంటి వారు మీకు తెలియాలి. కొన్ని సంకేతాల సహాయంతో ఎదుటివారిని జస్ట్ అవసరాలకు మాత్రమే వాడుకునే వ్యక్తులను గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

భావాలను గౌరవించకపోవడం 

ఫ్రెండ్షిప్ లేదా ఏ బందంలోనైనా ఎదుటివ్యక్తి భావాలను గౌరవించాలి. అలా కాకుండా పదే పదే మీ భావాలను అర్థం చేసుకోకపోవడం, విస్మరించడం వంటివి చేస్తే అవతలి వ్యక్తికి మీ గురించి అవసరం లేదని సంకేతం. అలాంటి వ్యక్తులు వారి స్వంత సమస్యలపై మాత్రమే దృష్టి పెడతారు. మిమల్ని కేవలం ప్రయోజనాల కోసం మాత్రమే యూజ్ చేసుకుంటారు.   

Also Read :  ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్‌.. 295కే ఆసిస్ ఆలౌట్

ప్రతీ సారి మీ నుంచే సహాయం ఆశించడం

స్నేహమైనా, రిలేషన్ షిప్ లోనైనా రెండు వైపుల నుంచి మద్దతు అవసరం. కానీ ఎవరైనా మీ సహాయం ప్రతీసారి మీ సహాయం కోరి.. మీకు తిరిగి సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా లేకపోతే.. అలాంటి వారు మిమల్ని అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారని సంకేతం. 

అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం.. 

ఒక ఇతర సమయాల్లో కాకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం, ఫోన్ చేయడం చేస్తే.. అతను మిమల్ని అవసరానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడనడానికి సంకేతం. అలంటి వ్యక్తులు మీ భావాలను పట్టించుకోరు. మీ నుంచి ఏదైనా ప్రయోజనం ఉంటేనే మిమల్ని లెక్క చేస్తారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే ఫోన్ చేసే వారంతా ఇలాంటి వారే అని చెప్పలేము. వ్యక్తి ప్రవర్తన ఆధారంగా ఇది తెలిసిపోతుంది. 

Also Read :  ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్‌లోకి ముగ్గురు మాజీ మంత్రులు!

సరిహద్దులను గౌరవించనివారు 

ఎదుటివ్యక్తి సరిహద్దులను గౌరవించకపోవడం, తమ కోరికలను ఎదుటివారిపై విధించాలనుకునే వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. అలాంటి వ్యక్తులు మీ ప్రైవెసీ, స్వేచ్ఛ గురించి పట్టించుకోరు. వారి స్వంత ప్రయోజనాల కోసం మాత్రమే మిమల్ని ఉపయోగించుకుంటారు. పై లక్షణాలన్నీ కనిపించే వ్యక్తులను దూరంగా ఉంచడం ద్వారా జీవితంలో ప్రశాంతత, ఆనందం పొందుతారు. 

Also Read: రూ.1200కోట్ల సినిమా మిస్ చేసుకున్న సామ్.. అందులో హీరో ఎవరో తెలుసా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు