GST: విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. జీఎస్‌టీ స్లాబ్‌ల మార్పుతో పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు

ప్రస్తుతం బిజినెస్, ప్రీమియం క్లాస్ ఫ్లైట్ టికెట్లపై 12 శాతం జీఎస్టీ ఉంది. కానీ ఇప్పుడు 18 శాతానికి పెంచారు. దీంతో విమాన టికెట్ల ధరలు పెరగనున్నాయి. కేవలం బిజినెస్, ప్రీమియం క్లాస్ ఫ్లైట్ టికెట్లపై మాత్రమే 18 శాతానికి జీఎస్‌టీ పెంచారు.

New Update
Flight charges

Flight charges

నిత్యావసర సరుకుల ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ స్లాబ్‌ల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం నాలుగు స్లాబ్‌ల విధానం అమల్లో ఉండగా ఇకపై రెండు స్లాబ్‌ల విధానాన్ని తీసుకురానుంది. దీంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గడంతో పాటు మరికొన్ని పెరుగుతాయి. అయితే ఈ స్లాబ్‌ల మార్పుల వల్ల లగ్జరీ కార్లు, పొగాకు, సిగరెట్లు, కార్బొనేటేడ్ డ్రింక్స్‌తో పాటు విమాన టికెట్లు కూడా పెరుగుతాయి.  

ఇది కూడా చూడండి: GST Tax Slabs Changes: ఇకపై ఏసీ, టీవీలు, ఎలక్ట్రానిక్స్ చౌక చౌక.. ఈ రేట్లు అస్సలు ఊహించలేరు..!

ఈ టికెట్లపై 18 శాతం పెంపు..

ప్రస్తుతం బిజినెస్, ప్రీమియం క్లాస్ ఫ్లైట్ టికెట్లపై 12 శాతం జీఎస్టీ ఉంది. కానీ ఇప్పుడు 18 శాతానికి పెంచారు. దీంతో విమాన టికెట్ల ధరలు పెరగనున్నాయి. ఈ భారమంతా ప్రయాణికులపై పడనుంది. కేవలం బిజినెస్, ప్రీమియం క్లాస్ ఫ్లైట్ టికెట్లపై మాత్రమే 18 శాతానికి జీఎస్‌టీ పెంచారు. ఎకానమీ క్లాస్ టికెట్లపై 5 శాతం జీఎస్‌టీ ఉంది. 

ఇది కూడా చూడండి: GST: జీఎస్‌టీ స్లాబ్‌ల ఎఫెక్ట్ సామాన్యులకు బిగ్ షాక్.. ఈ వస్తువులపై భారీగా పెంపు!

ధరలు పెరగనున్న వస్తువులు ఇవే!

పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు, సిగరెట్లపై పన్ను 28 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. అలాగే కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ ఉన్న పానీయాల ధరలు పెరుగుతాయి. అలాగే లగ్జరీ కార్లు, పెద్ద మోటార్‌ సైకిళ్లు, ప్రైవేట్ విమానాలు, రివాల్వర్లు, పిస్టల్‌ వంటి వాటిపై పన్నును 40 శాతానికి పెంచారు. వీటితో పాటు బొగ్గు, లిగ్నైట్‌పై 5 శాతం నుంచి 18 శాతానికి పన్నును పెంచారు. బయోడీజిల్‌పై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచారు.  అలాగే రూ. 2,500 కన్నా ఎక్కువ ధర ఉన్న ప్రీమియం వస్త్రాలు, టెక్స్‌టైల్, హై-వాల్యూ కాటన్ దుప్పట్లపై 18 శాతానికి పన్ను పెంచారు. ఈ వస్తువులపై భారీగా ధరలు పెరగనున్నాయి. హెయిర్‌ ఆయిల్, టూత్ పేస్ట్, టూత్ బ్రెష్‌లు, షేవింగ్‌ క్రీమ్‌లుపై 5 శాతం పన్ను విధించనున్నారు. వీటిపై ధరలు తగ్గనున్నాయి.

Advertisment
తాజా కథనాలు