GST: జీఎస్‌టీ స్లాబ్‌ల ఎఫెక్ట్ సామాన్యులకు బిగ్ షాక్.. ఈ వస్తువులపై భారీగా పెంపు!

కేంద్ర ప్రభుత్వం మార్చిన జీఎస్‌టీ స్లాబ్‌ల వల్ల పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు, సిగరెట్లపై పన్ను 28 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. అలాగే కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ ఉన్న పానీయాలు, ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్ ధరలు కూడా పెరుగుతాయి.

New Update
GST

NEW GST RATES

సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నులో కీలక మార్పులు చేసింది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని వస్తువులపై జీఎస్‌టీ రేట్లను మార్చాలని నిర్ణయించారు. ఈ మార్పుల వల్ల సామాన్యులకు ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు చాలా వరకు తగ్గుతాయి. కానీ మిగతా కొన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతాయి. అయితే ఇకపై 5, 18 స్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. 12, 28 పన్ను స్లాబ్‌లను తొలగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది. అయితే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అన్ని కూడా అమల్లోకి వస్తాయి. మరి ఈ జీఎస్టీ స్లాబ్‌ల మార్పుల వల్ల ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: New GST Slabs: మారిన జీఎస్టీ శ్లాబ్ రేట్స్..కార్ల నుంచి బిస్కెట్ల వరకూ రేట్లు తగ్గిన వస్తువుల లిస్ట్ ఇదే..

ధరలు పెరిగే వస్తువులు

పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు, సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం పన్ను 28 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. అలాగే కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ ఉన్న పానీయాలు, ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్ ధరలు కూడా పెరుగుతాయి. అలాగే లగ్జరీ కార్లు, పెద్ద మోటార్‌ సైకిళ్లు, ప్రైవేట్ విమానాలు, రివాల్వర్లు, పిస్టల్‌ వంటి వాటిపై పన్నును 40 శాతానికి పెంచారు. వీటితో పాటు బొగ్గు, లిగ్నైట్‌పై 5 శాతం నుంచి 18 శాతానికి పన్నును పెంచారు.  బయోడీజిల్‌పై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచారు.  అలాగే రూ. 2,500 కన్నా ఎక్కువ ధర ఉన్న ప్రీమియం వస్త్రాలు, టెక్స్‌టైల్, హై-వాల్యూ కాటన్ దుప్పట్లపై 18 శాతానికి పన్ను పెంచారు. ఈ వస్తువులపై ధరలు భారీగా పెరగనున్నాయి.

ఇది కూడా చూడండి: Full Josh: జీఎస్టీ శ్లాబ్ ల మార్పు.. పండుగ చేసుకుంటున్న స్టాక్ మార్కెట్

ధరలు తగ్గేవి ఇవే
హెయిర్‌ ఆయిల్, టూత్ పేస్ట్, టూత్ బ్రెష్‌లు, షేవింగ్‌ క్రీమ్‌లుపై 5 శాతం పన్ను విధించనున్నారు. ఇక నిత్యం ఉపయోగించే బటర్‌, నెయ్యి, చీజ్‌ వంటి డెయిరీ పదార్థాలు కూడా తగ్గనున్నాయి. పాలు, పన్నీర్, ఇండియన్ బ్రెడ్‌లను పూర్తిగా జీఎస్‌టీ నుంచి మినహాయించారు. చిన్న పిల్లలు వాడే నాప్కిన్లు, ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలు, స్పెసిపైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రింట్స్‌, మ్యాప్‌లు, చార్టులు, గ్లోబ్, పెన్సిళ్లు, షార్ప్‌నర్, క్రేయాన్స్, ప్యస్టెల్స్, ఎక్సర్సైజ్ పస్తకాలు, నోట్ బుక్స్ ల మీద జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ వస్తువుల ధరలు అన్ని కూడా తగ్గనున్నాయి.

Advertisment
తాజా కథనాలు