/rtv/media/media_files/2025/07/27/gold-vs-assets-2025-07-27-18-17-52.jpg)
Gold vs assets
Gold Vs Assets
ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
బంగారం
బంగారం అనేది ఇండియాలో చాలా ముఖ్యమైనది. పెళ్లి, పండుగలు ఇలా ఏ శుభకార్యం ఉన్నా తప్పకుండా కొనుగోలు చేస్తుంటారు. అయితే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. బంగారానికి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. దీన్ని అవసరమైనప్పుడు సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. అయితే బంగారం డివిడెండ్‌లు లేదా వడ్డీని ఉత్పత్తి చేయదు. దీన్ని నిల్వ చేయడానికి తప్పకుండా లాకర్స్ తీసుకోవాలి. స్టాక్ మార్కెట్ మాదిరిగానే బంగారం ధరలు కూడా అప్పుడప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మీరు ఆభరణాల రూపంలో కొంటే, తరుగు, మజూరీ వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కూడా వర్తిస్తుంది. మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లు లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌ల ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
ల్యాండ్
ఇళ్లు, ప్లాట్లు, వాణిజ్య భవనాలు వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా లాభాలు వస్తాయి. దీర్ఘకాలంలో ఏదైనా స్థలం లేదా ఆస్తి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేసి దాన్ని అద్దెకు ఇవ్వడం వల్ల ప్రతీ నెలా కూడా ఆదాయం పొందవచ్చు. ఆస్తుల విషయంలో పెట్టుబడికి అధిక మూలధనం అవసరం అవుతుంది. దీనికి లిక్విడిటీ తక్కువ, అంటే ఆస్తిని వెంటనే నగదుగా మార్చడం కష్టం. కొనుగోలుదారులు దొరకడం, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు సమయం పడుతుంది. ఆస్తికి నిర్వహణ, మరమ్మతులు, పన్నులు వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. స్థానిక మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ విధానాలు వీటి ధరలను ప్రభావితం చేస్తాయి. అద్దెదారులు అద్దె చెల్లించకపోవడం, ఆస్తికి నష్టం కలిగించడం వంటివి చేస్తారు.
ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
ఏది ఎక్కువ లాభం?
గత 10-15 సంవత్సరాల నుంచి గమనిస్తే బంగారం ఆస్తుల కంటే మెరుగైన రాబడిని ఇచ్చినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఉదాహరణకు బంగారం వార్షికంగా సుమారు 11-14% రాబడిని ఇస్తే, ఆస్తులు 5-6% రాబడిని ఇచ్చాయి. అయితే భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటుందని చెప్పలేం. మార్కెట్ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. త్వరగా లాభాలు, అధిక లిక్విడిటీ కోరుకుంటే బంగారం మంచి ఎంపిక. అదే దీర్ఘకాలిక సంపద సృష్టి, స్థిరమైన ఆదాయం, ఆస్తులు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.