Flipkart న్యూ సేల్.. ఐఫోన్ 15 ఇంత చీపా.. ఆఫర్లే ఆఫర్లు మావా!

ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్ ప్రకటించింది. బిగ్ దీపావళి 2024 సేల్‌‌ను అక్టోబర్ 21 నుంచి ప్రారంభించనుంది. అదే సమయంలో Flipakrt Plus లేదా VIP కస్టమర్లకు అక్టోబర్ 20న అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ సేల్‌లో ఐఫోన్ 15ను రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది.

Flipkart Big Diwali 2024 Sale
New Update

పండుగ సీజన్‌ మొదలైంది. ఇటీవలే దసరా ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్‌ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించి అదరగొట్టేసింది. ఇక త్వరలో దీపావళి మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో మరో న్యూ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి 2024 సేల్‌‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో వివిధ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. తాజాగా ఈ సేల్ తేదీ, బ్యాంక్ డిస్కౌంట్‌లు ప్రకటించబడ్డాయి.

ఇది కూడా చదవండి: ఎస్బీఐలో 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. లాస్ట్ డేట్ ఇదే

Flipkart Big Diwali 2024 sale

Flipkart Big Diwali 2024 sale అక్టోబర్ 21 నుండి ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే Flipakrt Plus లేదా VIP కస్టమర్లకు అంతకంటే ఒకరోజు ముందు అక్టోబర్ 20న అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రాబోయే ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై అనేక ఆఫర్‌లను కస్టమర్లు పొందుతారు.

ఇది కూడా చదవండి: రైల్వేలో 8,113 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. కొద్ది గంటలే సమయం

iPhone 15 Big Offer

అదే సమయంలో SBI డెబిట్/ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌లపై 10 శాతం అదనపు తగ్గింపును పొందగలరు. తాజాగా కొన్ని పొడక్టులకు సంబంధించిన డిస్కౌంట్ల టీజర్ రిలీజ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని  బిగ్ దీపావళి 2024సేల్ ల్యాండింగ్ పేజీలో iPhone 15 రూ. 49,999కి అందుబాటులో ఉంటుందని వెల్లడైంది. అంతేకాకుండా Apple MacBook M2ని భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

Samsung Galaxy S23 Offer

అలాగే ప్రీవియస్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ మోడల్‌లు రూ. 9,999 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని లిస్టింగ్ పేజీలో వెల్లడైంది. దీంతోపాటు Samsung Galaxy S23 స్మార్ట్‌ఫోన్‌ను రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి 2024 సేల్ సందర్భంగా రూ. 37,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుందని చెప్పబడింది.

ఇది కూడా చదవండి: డిప్యూటీ కలెక్టర్​ పీవీ సింధు.. ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు

ఇంకా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ప్రకారం.. వినియోగదారులు Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ని రూ.29,249కి కొనుగోలు చేయగలుగుతారని ఉంది. అలాగే 64GB స్టోరేజ్‌తో iPad (2021)ను రూ.17,499కి కొనుక్కోవచ్చని చెప్పబడింది. దీంతోపాటు మరెన్నో అద్భుతమైన ప్రొడక్టులను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చని చెప్పబడింది. 

#flipkart #apple-iphone-15 #mobile-offers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe