ఎస్బీఐలో 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. లాస్ట్ డేట్ ఇదే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్ మెంట్, కార్పొరేట్ సెంటర్ శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి 1,511 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 14 అక్టోబర్, 2024 చివరితేదీ.

New Update
sbi (1)

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్ మెంట్, కార్పొరేట్ సెంటర్ భారీ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగానే రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా సుమారు 1,511 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

డిప్యూటీ మేనేజర్ - సిస్టమ్స్ - ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ.. 187 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ - సిస్టమ్స్ - ఇన్ ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్.. 412 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ - సిస్టమ్స్ - నెట్ వర్కింగ్ ఆపరేషన్స్.. 80 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ - సిస్టమ్స్ - ఐటీ ఆర్కిటెక్ట్.. 27 పోస్టులు 
డిప్యూటీ మేనేజర్ - సిస్టమ్స్ - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.. 7 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ - సిస్టమ్స్ - 798 పోస్టులు.. ఇలా మొత్తం 1,511 పోస్టులు ఉన్నాయి. 

ఇది కూడా చదవండిః రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..!

విద్యార్హతలు - పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. 

వయోపరిమితి - జూన్ 30, 2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక - ఎగ్జామ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్‌ సహా తదితరాల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. 

దరఖాస్తు ఫీజు - రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు చివరితేదీ - 14 అక్టోబర్, 2024. 

పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను చూడండి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు