Upcoming Smart Phones: ఫిబ్రవరిలో ఫోన్ల జాతర.. ఒకటి కాదు రెండు కాదు: ఎన్ని మొబైల్స్ లాంచ్ అవుతున్నాయంటే?

జనవరి 2025 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పలు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పలు ఫోన్లు లాంచ్‌కు సిద్ధంగా ఉన్నాయి. iQOO, Vivo, samsung, OPPO, Xiaomi వంటి బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు ఈ నెలలో లాంచ్ కానున్నాయి.

New Update
February 2025 Upcoming Mobile Phones

February 2025 Upcoming Mobile Phones

జనవరి 2025 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పలు ఫోన్లు లాంచ్ అయ్యాయి. Galaxy S25 సిరీస్, Poco X7 సిరీస్, Realme 14 Pro సిరీస్, OnePlus 13 సిరీస్ వంటి బ్రాండెడ్ మొబైల్స్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యాయి. 

ఇక ఇప్పుడు జనవరి పోయి ఫిబ్రవరి వచ్చేసింది. దీంతో ఈ నెలలో కూడా పలు ఫోన్లు లాంచ్‌కు సిద్ధంగా ఉన్నాయి. iQOO, Vivo, OPPO, Xiaomi వంటి కంపెనీల ఫోన్లు ఈ నెలలో లాంచ్ కానున్నాయి. మరి ఈ నెలలో ప్రారంభం కానున్న ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 

iQOO 10R

ఈ నెలలో iQOO నియో 10R లాంచ్ కానుంది. దీనిన రూ. 30,000 కంటే తక్కువ ధరలో మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌, 144Hz AMOLED స్క్రీన్‌‌ను కలిగి ఉంటుందని సమాచారం.

Vivo V50 సిరీస్

వివో వి50 సిరీస్ ఈ ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో V50, V50 ప్రో మోడల్స్ ఉండనున్నాయి. రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు బడ్జెట్ ఉన్నవారి కోసం ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి చివరి నాటికి ఆవిష్కరించబడుతుందని సమాచారం. ఈ రెండు మోడళ్లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

అలాగే 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇంకా 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం

ASUS Zenfone 12 Ultra

ఆసుస్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా Zenfone 12 Ultraను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో పంచ్-హోల్ నాచ్, స్లిమ్ బెజెల్స్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ఉంటాయి. 16GB RAM, ZenUI తో Android 15 తో నడుస్తుంది. ఇది 6.78 FHD+ AMOLED LTPO 165Hz ప్యానెల్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. అలాగే 5,800mAh బ్యాటరీతో 65W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

OPPO Find N5/OnePlus Open 2

Oppo Find N5 Q1 2025 విడుదలకు సిద్ధంగా ఉంది. అధికారిక విడుదల తేదీని అందించనప్పటికీ, ఈ నెలలో లాంచ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇది కొన్ని ప్రాంతాలలో OnePlus Open 2 గా రీబ్రాండ్ చేయబడుతుంది. 

Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట 

TECNO Curve

TECNO కంపెనీ భారతదేశంలో రూ. 10,000-20,000 ధర మధ్య కర్వ్డ్ డిస్‌ప్లేతో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇది మంచి అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.

Xiaomi 15 Ultra

Xiaomi 15 Ultra ఈ నెలలో చైనాలో అరంగేట్రం చేయనుంది. దీని కంటే ముందు Xiaomi 15, 15 Pro అక్టోబర్‌లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కొత్త Xiaomi 15 Ultra మోడల్ క్వాడ్-కెమెరా సెటప్‌తో రానుంది. 

Samsung Galaxy A36 - Galaxy A56

Samsung Galaxy A సిరీస్ ఈ నెలలో భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung Galaxy A36, Galaxy A56 ధర భారతదేశంలో రూ. 30,000 నుండి రూ. 45,000 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అధికారిక విడుదల తేదీ లేనప్పటికీ ఇది ఈ నెలలో లాంచ్ అవుతుందని చెబుతున్నారు. 

Infinix Note 50 series

ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ రూ. 15,000 కంటే తక్కువ ధర ఉన్న మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు