EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 100 శాతం విత్ డ్రా!

ఈపీఎఫ్‌ఓ ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. పీఎఫ్‌ 100 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల సుమారుగా 7 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది.

New Update
EPFO introduces single login system to enhance member access and satisfaction

EPFO

ఈపీఎఫ్‌ఓ ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. పీఎఫ్‌ 100 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ వెల్లడించింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్ట్ మీటింగ్‌లో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారుగా 7 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే గతంలో మొత్తం రిటైర్మెంట్, ఉద్యోగం కోల్పోయినప్పుడు మాత్రమే మొత్తం 100 శాతం వరకు అనుమతించేవారు. కానీ EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రా విషయంలో గతంలో 13 రూల్స్ ఉండేవి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మూడు కేటగిరీలుగా మార్చారు. ఇందులో అత్యవసర పరిస్థితులు, గృహ నిర్మాణ అవసరం, ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ మూడు కేటగిరీల్లో మాత్రమే పీఎఫ్ డబ్బులను 100 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: Postal Insurance : పోస్టాఫీస్ అద్భుతమైన స్కీమ్ .. రూ.755 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షలు

మినిమం సర్వీస్ రూల్ ఉండేలా..

 పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు మినిమం సర్వీస్ రూల్ ఉండేలా చేశారు. ఇక నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఐదేళ్ల కనీస సర్వీసులు కూడా అవసరం లేదు. కేవలం ఏడాది పాటు సర్వీస్ ఉంటే చాలు. అయితే ఎడ్యుకేషన్ కోసం మొత్తం పదిసార్లు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే వివాహం కోసం ఐదుసార్లు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే కొంత మొత్తం పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు ఎలాంటి పేపర్ డాక్యుమెంట్లు అవసరం లేదు. ఇక నుంచి పూర్తిగా 100 శాతం ఆటో సెటిల్మెంట్ జరుగుతుంది. అలాగే పీఎఫ్ రిజెక్షన్ క్లెయిమ్‌లను తగ్గించడంతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్‌కు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించారు. ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ఉపయోగించుకునేలా మార్పులు చేశారు.

ఇది కూడా చూడండి: Best Investment scheme: బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. 5 ఏళ్లలో రూ.36 లక్షలు.. ఎలాగంటే?

Advertisment
తాజా కథనాలు