Best Investment scheme: బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. 5 ఏళ్లలో రూ.36 లక్షలు.. ఎలాగంటే?

పోస్టాఫీస్ ఆర్డీలో నెలకు కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేసినా చాలు. భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు తగ్గినట్లే. అయితే ఇందులో ఇంతే కట్టాలని గరిష్ట పరిమితి అయితే లేదు. మీరు ప్రతీ నెల కట్టే డబ్బు మీకు ఐదేళ్ల తర్వాత వడ్డీతో వస్తుంది.

New Update
post office

post office

డబ్బు సంపాదించడం గొప్ప కాదు.. సంపాదించిన డబ్బును ఎలా రెట్టింపు చేశామన్నదే గొప్ప. అయితే భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు కొందరు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే నెలకు తక్కువ డబ్బును ఇన్వెస్ట్ చేసి కేవలం 5 ఏళ్లలో రూ.36 లక్షలు సంపాదించడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Gold ETF: అదిరిపోయే గోల్డ్ బాండ్స్.. రూపాయి పెడితే వంద రూపాయిలు.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావడం పక్కా!

నెలకు రూ.100 ఇన్వెస్ట్ చేసిన చాలు..

మనకి తెలియకుండా ఎన్నో పథకాలు పోస్టాఫీసులో ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఇందులో ఎవరైనా పొదుపు చేస్తే లాభాలు బాగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పోస్టాఫీస్ ఆర్డీలో నెలకు కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేసినా చాలు. భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు తగ్గినట్లే. అయితే ఇందులో ఇంతే కట్టాలని గరిష్ట పరిమితి అయితే లేదు. మీరు ప్రతీ నెల కట్టే డబ్బు మీకు ఐదేళ్ల తర్వాత వడ్డీతో వస్తుంది. ఉదాహరణకు మీరు నెలకు ఒక రూ.50 వేలు డిపాజిట్ చేశారనుకోండి. ఐదేళ్లలో మొత్తం పెట్టుబడి రూ.30 లక్షలు అవుతుంది. దీనిపై మీకు 6.7 శాతం వడ్డీతో లభిస్తుంది. అయితే మీకు రూ.5.68 లక్షల లాభం వస్తుంది. మీరు కట్టిన డబ్బుతో కలిపి మొత్తం రూ.35.68 లక్షలు వస్తాయి. ఇలా మీరు ఆర్థిక పరిస్థితిని బట్టి నెలకు కొంత డబ్బులు కట్టుకోవచ్చు.

ఇది కూడా చూడండి: Postal Insurance : పోస్టాఫీస్ అద్భుతమైన స్కీమ్ .. రూ.755 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షలు

ఈ పథకం అనేది పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి పిల్లలు కూడా తీసుకోవచ్చు. అయితే తల్లిదండ్రుల సహాయంతో తీసుకోవాలి. వారికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత KYC వివరాలు సమర్పించాలి. పిల్లల భవిష్యత్తు, విద్య, వివాహం కోసం ఉపయోగపడతాయి. అయితే ఖాతాను ఏ తేదీని ఆ తేదీ సమయానికి వాయిదాలు చెల్లించాలి. ఎప్పుడైనా ఒక నెల కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. అయితే మీరు కనీసం ఏడాది పాటు డిపాజిట్ చేస్తే ఒక 50 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. ఈ రుణంపై RD వడ్డీ రేటుతో పాటు 2 శాతం అదనంగా వసూలు చేస్తారు. రుణాన్ని వాయిదాలు లేదా ఒకేసారి అయినా తిరిగి చెల్లించవచ్చు. అలాగే ఖాతా ఓపెన్ చేసి మూడేళ్లు అయినా కూడా ముందుగానే మీరు క్లోజ్ చేయవచ్చు. ఈ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు మీరు పోస్టాఫీసుకు వెళ్లాలి. ఆ తర్వాత ప్రతీ నెల పోస్టాఫీస్ మొబైల్ యాప్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు