/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/LPG-Gas-Cylinder-jpg.webp)
Gas-Cylinder Photograph: (Gas-Cylinder)
వచ్చే ఆర్థిక సంవత్సరానికి నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టకముందే గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ తెలిపాయి. నేడు గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. వివిధ జాతరలు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిలిండర్ ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావించారు.
ఇది కూడా చూడండి: Karthikeya 3: కార్తికేయ-3 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలపై మాత్రమే..
నేడు సిలిండర్ ధర గణనీయంగా తగ్గింది. అందులోనూ యూనియన్ బడ్జెట్ కంటే ముందు సిలిండర్ ధరలు తగ్గడంతో వినియోగదారులకు ఇది శుభవార్తే. అయితే కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రమే తగ్గాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ.6 తగ్గి.. రూ.1874.50కి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. నేటి నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయి. అయితే గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న ధర కొనసాగుతోంది.
ఇది కూడా చూడండి: Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
ఇదిలా ఉండగా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మనదేశ జీడీపీ గ్రోత్ 6.3-–6.8 శాతమే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ ధనిక దేశం కావడానికి ఇది సరి పోదని..రూల్స్ ను మరింత ఈజీ చేయాలని ఆమె అన్నారు. గ్రోత్ పెరగాలంటే భూ కార్మిక సంస్కరణల ఆవశ్యకత ఉందని ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే ఎనిమిది శాతం గ్రోత్ కావాలని ఆమె తెలిపారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!
ఇది కూడా చూడండి: Chennai Crime: ఏసీ ఆన్ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్ మిస్టరీ!