కిక్కిచ్చే రీఛార్జ్ ప్లాన్.. నెలకు రూ. 126, 365 రోజుల వ్యాలిడిటీ! బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే వార్షిక ప్లాన్ అందిస్తుంది. అందులో రూ.1515.. మరొకటి రూ.1499 రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. నెలకు కేవలం రూ.120 మాత్రమే పడుతుంది. అందువల్ల తక్కువ ధరతో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇవే బెస్ట్ అని చెప్పాలి. By Seetha Ram 31 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. ఏకంగా 25 శాతానికి పైగా పెంచేసి వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చాయి. దీంతో ఈ సిమ్ నెట్‌వర్క్ కలిగిన వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ అయిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL మాత్రం వాటికి భిన్నంగా ఉంది. Also Read: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే? తమ నెట్‌వర్క్‌కు వినియోగదారులను పెంచుకునేందుకు అత్యంత తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్ ధరలను అందించింది. చవకగా తీసుకొస్తూ లక్షల్లో సబ్‌స్రైబర్లను పొందింది. కస్టమర్లను పెంచుకునేందుకు అవసరమైన, అనుకూలమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. Also Read : యష్మీ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నిఖిల్.. బతిమాలినా వద్దంటూ.. దీంతో చాలా మంది జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు ఒక్కసారిగా బిఎస్ఎన్ఎల్ వైపుకు మగ్గుచూపారు. చాలా మంది బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న చవకైన రీఛార్జ్ ప్లాన్‌లకు ఆకర్షితులై పోర్ట్ అయిపోయారు. ఇప్పటికే ఎన్నో తక్కువ ధర కలిగిన ప్లాన్‌లను అందించిన బీఎస్‌ఎన్ఎల్ తాజాగా మరొక చవకైన ప్లాన్‌ను అందిస్తుంది. అతి తక్కువ ధరకే వార్షిక ప్లాన్ (ఏడాది ప్లాన్) అందిస్తుంది. ఆ ప్లాన్స్ ధర విషయానికొస్తే.. ఒకటి రూ.1515.. మరొకటి రూ.1499ల రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. నెలకు కేవలం రూ.120 మాత్రమే పడుతుంది. అందువల్ల తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తున్నవారికి ఇదొక అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు. Also Read: 'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. హిట్టా? ఫట్టా ? ఈ ఒక్క రివ్యూ చూస్తే చాలు రూ.1515 వార్షిక ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రూ.1515 వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. రోజుకు 2GB డేటా పొందొచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS ఫ్రీగా పొందొచ్చు. అలాగే.. హై స్పీడ్ డేటా అయిపోయాక 40 Kbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ రూ.1515 ప్లాన్‌లో నెలకు రూ.126 పడుతుంది. రూ. 1499 రీఛార్జ్ ప్లాన్ Also Read: యువరాణిలా ముస్తాబైన నటి.. కేతిక శర్మని ఇలా చూస్తే అంతే సంగతి! రూ.1499 రీఛార్జ్ ప్లాన్‌లో 336 రోజుల వాలిడిటీ పొందొచ్చు. అంటే 11 నెలలు అన్నమాట. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు మొత్తం 24GB డేటా పొందుతారు. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS లు లభిస్తాయి. #airtel-new-recharge-plans #bsnl #jio మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి