BSNL ఫ్రీడమ్‌ ప్లాన్..  ఫ్రీ సిమ్ ..రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌!

కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒక గొప్ప ఆఫర్ తో ముందుకు వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్‌ పేరిట దీన్ని లాంచ్‌ చేసింది.

New Update
bsnl

కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒక గొప్ప ఆఫర్ తో ముందుకు వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్‌ పేరిట దీన్ని లాంచ్‌ చేసింది. ప్రస్తుతం తక్కువ ధరకే 4G ప్లాన్ అందిస్తోన్న ఈ సంస్థ ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు ఫ్రీగా 4G సిమ్ అందిస్తున్నట్లుగా తెలిపింది. కేవలం రూ. 1 అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 2GB డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. కొత్త యూజర్లు రూ. 1 చెల్లించి 30 రోజులు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డైలీ 2GB డేటా , రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. ఈ ఆఫర్‌ కొత్త వినియోగదారులకు మాత్రమేనని ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌ వేదికగా  పోస్టు చేసింది.

Also Read :  తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

4జీ సేవలను విస్తరించడమే లక్ష్యంగా

ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్‌ కోసం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ)కు లేదా రిటైలర్‌ను సందర్శించొచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, 4జీ సేవలను విస్తరించడమే లక్ష్యంగా సంస్థ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.  ఈ ప్లాన్ ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది..  ఈ వ్యూహం జియో మాదిరిగానే ఉంది.  జియో ప్రారంభంలో ప్రజలకు ఉచిత సిమ్‌లను పంపిణీ చేసినట్లే, ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే తరహాలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల సంఖ్య తగ్గుతున్న సమయంలో ఈ ఆఫర్ ను ప్రకటించింది. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నివేదిక ప్రకారం ఏప్రిల్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ మొత్తం 0.2 మిలియన్ల కస్టమర్లను కోల్పోయింది.  

Also Read :  ఫోన్ పే, గూగుల్ పే వాడే వారు ఇవి పక్కా తెలుసుకోవాల్సిందే!

కొన్ని ముఖ్యమైన BSNL 4G ప్లాన్‌ల వివరాలు చూస్తే

రూ.  147: 10GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ.

రూ. 187: రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీ.

రూ. 247: 50GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ.

రూ. 398: అపరిమిత డేటా (FUP పరిమితి లేదు), అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 SMS, 30 రోజుల వ్యాలిడిటీ.

రూ. 599: రోజూ 5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 84 రోజుల వ్యాలిడిటీ.

రూ. 1498: రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 365 రోజుల వ్యాలిడిటీ.

రూ. 1999: రోజూ 3GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 365 రోజుల వ్యాలిడిటీ.

bsnl offers | latest technology news in telugu | latest-telugu-news | telugu-news | business news telugu

Advertisment
తాజా కథనాలు