Best Smartphones: కెవ్ అనిపించే కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్.. మొత్తం తొమ్మిది- ధర తక్కువే!

తక్కువ ధరలో మంచి ఫీచర్లుగల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఆన్‌లైన్ ప్లాట్‌ ఫార్మ్‌లలో చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.25వేల లోపు ఫోన్లు కింద అందించబడ్డాయి. అందులో మీకు నచ్చిన ఫోన్‌ను సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు.

New Update
Best Smartphones Under Rs 25,000 available on online platforms

Best Smartphones Under Rs 25,000 available on online platforms

తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన అవకాశం. భారతదేశం (India) లో రూ.25,000 లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఇక్కడ అందుబాటులో ఉంది. మోడల్, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Under Rs 25,000 Mobiles

Nothing Phone (2a) Plus 

ది బెస్ట్ ఆల్-రౌండర్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే నథింగ్ ఫోన్ (2a) ప్లస్ ఉత్తమమైన ఆప్షన్. దీని అధికారిక ధర రూ.25,999 అయినప్పటికీ మీరు Amazon, JioMart వంటి ప్లాట్‌ఫామ్‌లలో మరింత తక్కువ ధరకు దీన్ని పొందవచ్చు. 

Motorola Edge 50 Neo

Motorola ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. దానికి నిదర్శనం Edge 50 Neo ఫోన్. ఇది 50MP OIS ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్‌ను కలిగి ఉంది. అలాగే 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీనిని రూ.20,999లకే సొంతం చేసుకోవచ్చు. 

Poco F6 5G

గేమింగ్ ఔత్సాహికుల కోసం Poco F6 5G చాలా బెస్ట్. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.25వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దీని ధర రూ.23,999గా నిర్ణయించబడింది.

Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

Samsung Galaxy A35 5G 

Galaxy A35 5G 5G స్మార్ట్‌ఫోన్ 90Hz సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిని ఆన్‌లైన్‌లో రూ.24,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. 48MP ట్రిపుల్-కెమెరా సెటప్‌తో ఇది వస్తుంది. 

OnePlus Nord CE 4 5G

OnePlus Nord CE 4 5G స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoCతో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు సరైనది. దీనిని రూ.22,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లోని 50MP ప్రధాన కెమెరా బాగా పనిచేస్తుంది.

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

Lava Agni 3 5G

Lava Agni 3 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో శక్తివంతమైన 1.5K OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనిని రూ.20,999లతో కొనుక్కోవచ్చు. 

Vivo T3 Pro 5G

వివో T3 ప్రో 5G ఫోన్ ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను తక్కువ ప్యాకేజీలో కొనుక్కోవచ్చు. కేవలం రూ.22,999 ధరతో అందుబాటులో ఉంది. ఇది 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

Redmi Note 14 Pro 5G 

Redmi Note 14 Pro 5G ఫోన్ అత్యంత మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్‌ల నుంచి రూ.24,999లకు సొంతం చేసుకోవచ్చు.

Realme P3 Pro 5G - రూ. 23,999

ఇక చివరిగా Realme P3 Pro 5G ఉంది. దీనిని కూడా రూ. 25,000 లోపే కొనుక్కోవచ్చు. ఇది శక్తివంతమైన విజువల్స్ కోసం క్వాడ్-కర్వ్డ్ 120Hz OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను రూ.23,999 ధరతో కొనుక్కోవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు