బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు

అధునాతన ఫీచర్లు కలిగిన ఒక కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో పలు ఫోన్లు కేవలం రూ.10,000 లోపే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రెడ్ మి, మోటో, ఇన్ ఫినిక్స్, పోకో, ఐటెల్ వంటి 5జీ ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు.

Best 5G Smartphones Under Rs.10000
New Update


ఒక కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరలో అద్భుతమైన ఆఫర్లతో కొనుక్కోవాలని చూస్తున్నారా? అలాంటి ఫోన్ కోసం ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. కేవలం రూ.10,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో అందించబడ్డాయి. అందులో మీకు నచ్చిన ఫోన్ ను మరిన్ని ఆఫర్లతో తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

SAMSUNG Galaxy A14 5G

SAMSUNG Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో రూ.10 కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.15,499 కాగా ఇప్పుడు 35 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,999కే లిస్ట్ అయింది. అంటే దీనిపై రూ.5,500 తగ్గింపు లభించింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇది కాకుడా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. దాదాపు రూ.6,800 లభిస్తుంది. దీంతో మరింత తక్కువ ధరకే SAMSUNG Galaxy A14 5G ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. 

REDMI 13c 5G

ఇది కూడా చదవండిః Vivo Y28s 5G ఫోన్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

ఫ్లిప్ కార్ట్ లో REDMI 13c 5G ఫోన్ కూడా రూ.10 వేల కంటే తక్కువకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.13,999 కాగా ఇప్పుడు 33 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,378కే సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ.4,621 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.750, HDFC క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్ పై రూ.1250 తగ్గింపు లభిస్తుంది. 

Motorola g45 5G 

Motorola g45 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.12,999 ఉండగా ఇప్పుడు రూ.9,999లకే కొనుక్కోవచ్చు. దీనిపై రూ.3000 డిస్కౌంట్ పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్లు లేవు. కానీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి. రూ.6,800 వరకు భారీ ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. దీంతో మరింత తక్కువకే Motorola g45 5G ని సొంతం చేసుకోవచ్చు. 

POCO M6 5G 

POCO M6 5G స్మార్ట్ ఫోన్ కూడా తక్కువకే లభిస్తుంది. దీని ధర రూ.13,999 కాగా ఇప్పుడు రూ.9,799కే కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండిః  మతిపోగొట్టే ఆఫర్.. కేవలం రూ.2,099కే 5జీ ఫోన్!

Infinix Hot 50 5G 

వీటితో పాటు Infinix Hot 50 5G రూ.9,999కి కొనుక్కోవచ్చు.

itel P 55 5G

itel P 55 5G రూ.9,699కి సొంతం చేసుకోవచ్చు

Also Read :  నవరాత్రుల స్పెషల్‌.. గర్బా డ్యాన్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

#tech-news-telugu #5g-smartphones #mobile-offers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe