Amazon Prime : ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు షాకిచ్చింది. 2025 జనవరి నుంచి ప్రైమ్ మెంబర్‌షిప్ వినియోగ విధానంలో కొత్త మార్పులను తీసుకురానుంది. కొత్త విధానంలో ప్రైమ్ మెంబర్స్ కేవలం 5 డివైజులలో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో రెండు టీవీలో మాత్రమే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపై, రెండు టీవీలకు మించి స్ట్రీమింగ్ చేయాలంటే, వినియోగదారులు మరొక ప్రైమ్ మెంబర్‌షిప్ కొనుగోలు చేయాలి. ఒకవేళ లిమిట్ కి మించి మూడు టీవీల్లో లాగిన్ అయితే.. 3 నిమిషాలకు లాగ్ అవుట్ అవుతుంది.
Also Read : దారుణం.. అక్క కాపురంలో అత్త చిచ్చు పెడుతుందని..
ప్రస్తుతం 10 డివైజులు
అయితే ప్రస్తుత సబ్ స్క్రిప్షన్ లో 10 డివైజుల్లో ఒకేసారి లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అందులో 5 టీవీలో లాగిన్ అవ్వొచ్చు. మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లో ఇలా ఏ డివైజ్ లోనైనా లాగిన్ చేయొచ్చు. 2024లో అమెజాన్ ఎన్నో పాపులర్ సినిమాలు, సిరీస్‌లను విడుదల చేసింది. అందులో మిర్జాపూర్, పంచాయత్, సిటాడెల్: హనీ బనీ, స్ట్రీ 2, కల్పి 2898 ఏడీ, ది రింగ్స్ ఆఫ్ పవర్, ఫల్అవుట్ వంటి చిత్రాలు అత్యధికంగా వీక్షించబడ్డాయి.
Also Read : పెట్రోల్ బంక్ లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురి మృతి!
Amazon Prime video's new policy will be applicable from January, 2025.
— Abhishek Yadav (@yabhishekhd) December 20, 2024
- You can stream on up to 5 devices including up to 2 TVs.
- Previously up to 10 devices.#Amazon #PrimeVideo #AmazonPrime pic.twitter.com/kl6JXw8AgI
Also Read : తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్?
ఇది కూడా చూడండి: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!