దసరా పోయింది. దివాళి వచ్చింది. దీంతో స్మార్ట్‌ఫోన్స్ కోనేవారు ఆఫర్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒక కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారీ ఆఫర్లతో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 లోపే అదునాతన ఫీచర్లు గల 5జీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?
Motorola g45 5G
Motorola g45 5G స్మార్ట్‌ఫోన్ 4/128జీబీ వేరియంట్ రూ.12,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.9,999లకే అందుబాటులో ఉంది. అంటే దాదాపు రూ.3000 తగ్గింపు లభించిందన్నమాట. అంతేకాకుండా దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి.. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ కూడా పొందొచ్చు. దీంతోపాటు రూ.6,800 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో మరింత తక్కువ ధరకే పొందొచ్చు. ఇది వెనుకవైపు 50MP + 2MP కెమెరా.. ముందు వైపు 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
Also Read : దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి
SAMSUNG Galaxy A14 5G
SAMSUNG Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్ 4/128జీబీ వేరియంట్‌ను కూడా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.15,499 ఉండగా.. ఇప్పుడు రూ.9,999లకు సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.5,500 తగ్గింపు లభిస్తుందన్నమాట. దీనిపై కూడా రూ.6,800 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. ఇది వెనుక వైపు 50MP + 2MP + 2MP కెమెరాను.. 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.
Infinix Hot 50 5G
Also Read : 'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. చూస్తే షాకవుతారు!
Infinix Hot 50 5G ఫోన్ 4/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఇప్పుడు రూ.9,999లకు సొంతం చేసుకోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డు ట్రాన్సక్షన్‌పై రూ.750, SBI క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1250 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే రూ.7800 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫోన్ వెనుకవైపు 48MP + Depth Sensor, ముందువైపు 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
POCO M6 5G
POCO M6 5G మొబైల్ 6/128 ఫోన్ రూ.13,999 కాగా ఇప్పుడు రూ.9,499కే కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.4,500 తగ్గింపు లభిస్తుందన్నమాట. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. అలాగే రూ.6,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది.
Also Read : రేవంత్ కుట్రలకు భయపడేది లేదు: KTR
REDMI 13c 5G
REDMI 13c 5G ఫోన్ 4/128 జీబీ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు రూ.8,999లకే కొనుక్కోవచ్చు. ఇది వెనుకవైపు 50MP Rear Cameraను కలిగి ఉంటుంది. దీంతో పాటు మరెన్నో ఫోన్లు కేవలం రూ.10వేల లోపు కొనుక్కోవచ్చు.