రేవంత్ కుట్రలకు భయపడేది లేదు: KTR TG: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన హామీల అమలుపై భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తి వాట్సాప్‌లో ప్రశ్నించారని, దీంతో మహబూబ్‌నగర్ సీఐ కొట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. By V.J Reddy 31 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి MLA KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతికేకంగా పోస్టులు పెడుతున్నాడని ఓ యువకుడిని జైల్లో వేసి పోలీసులు కొట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం వాట్సాప్ లో ప్రశ్నించినందుకు భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తిని మహబూబ్ నగర్ సీఐ అప్పయ్య బెల్ట్ తో కొట్టిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు భాస్కర్ కు ఫోన్ చేసిన జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి బెదిరింపులకు భయపడేది లేదు.. రేవంత్ రెడ్డి లాంటి హౌలా వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. దాడికి పాల్పడిన సీఐపై న్యాయ పరంగా పోరాటం చేయటంతో పాటు బీసీ కమిషన్, హ్యుమన్ రైట్స్ కమిషన్ కు కూడా వెళ్తామన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ మొత్తం భాస్కర్ కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి అడిగిన వారిని ఇలా పోలీసులతో కొట్టించటం దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఇది కూడా చదవండి: రెండు రోజుల ముచ్చటే..మళ్ళీ నష్టాల్లోకి మార్కెట్ పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు మద్దతుగా నిలుస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మిత్తితో సహా చెల్లిస్తామన్నారు. బాధితుడు భాస్కర్ తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కూడా కేటీఆర్ మాట్లాడారు. భాస్కర్ విషయంలో ఎంత దూరమైన కలసికట్టుగా పోరాటం చేద్దామని ఆయనకు సూచించారు. ఇది కూడా చదవండి: కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ ! 💥 రేవంత్ రెడ్డి లాంటి హౌలా వ్యక్తులకు భయపడేది లేదు.- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔹 మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ హామీలపై ప్రశ్నించిన వ్యక్తిని సీఐ కొట్టిన ఘటనపై సీరియస్.🔹 బాధితుడికి ఫోన్ చేసి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన కేటీఆర్.రేవంత్ రెడ్డి ఎన్నికలకు… pic.twitter.com/qoU59R4iDs — BRS Party (@BRSparty) October 30, 2024 ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి