BB Patil: కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ?

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసే ఆలోచలనలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

New Update
BB Patil: కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ?

BB Patil: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలల్లో చేరుతున్న విషయం తెలిసిందే. నేతలను కాపాడుకునే పనిలో పడ్డ బీఆర్ఎస్ మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో మంతనాలు జరుపుతున్నారట.

దానికి ఓకే అంటే రెడీ..

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ గా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తెలంగాణ నేతలతో రహస్య చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన అడిగిన టికెట్ ఇచ్చేందుకు తెలంగాణ బీజేపీ నేతలు నో అని అంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన దానికి బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన బీజేపీలో చేరుతారని రాష్ట్ర రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది.

NEWS IS BEING UPDATED

Advertisment
తాజా కథనాలు