MLA KTR : కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్(BRS) కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR). ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను(TS Election Results) చూసి ఎవరు అధైర్యపడొద్దని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party), బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు.
ALSO READ: పద్మ అవార్డ్ గ్రహీతలను సత్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
అభివృద్ధికి ఓటేశారు..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థం అవుతుందన్నారు. హైదరాబాదీ ఓటర్లు(Hyderabadi Voters) తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు.
వంద రోజుల వరకే..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయని అని అన్నారు కేటీఆర్. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ తో కాదు..
బీజేపీ(BJP) ని ఆపగలిగే శక్తి కేవలం దేశంలో ఉన్న బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్‌కు బీజేపీని ఓడించే దమ్ము ఉంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 స్థానాలను ఈ సారి నిలబెట్టుకునే అవకాశం కూడా లేదంటూ టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్టీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
DO WATCH: