BRS MLA's: కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతోనే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారని బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నారు.

New Update
BRS MLA's: కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

BJP Ex MLA Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA's) కలవడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ తో సమావేశం అవ్వడంపై బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం వెనుక మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) హస్తం ఉందని అన్నారు.

ఇది కూడా చదవండి: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్

హరీష్ చెప్పాడనే...

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ప్రస్తుత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతోనే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని అన్నారు. ఇప్పుడు నలుగురు కలిశారు.. త్వరలో అది 26కు చేరుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత రఘునందన్ రావు (Raghunandan Rao) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.

అసలు ఏమి జరిగిందంటే..

మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్న క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంగళవారం (నిన్న) సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) , మాణిక్ రావు (జహీరాబాద్) సమావేశం అయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకు భేటీ అయ్యారనే దానిపై ప్రజల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అందుకోసం కాదు..

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. తాము త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని పుకార్లు వస్తున్నాయని వాటిని నమ్మవద్దని అన్నారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే (BRS Party) కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తమ నియోజక వర్గ సమస్యలు చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.!

DO WATCH:

Advertisment
తాజా కథనాలు