Harish Rao: ఆర్టీసీని ఎప్పుడు విలీనం చేస్తారు.. హరీష్‌ రావు ఫైర్

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా కూడా విలీనం ఊసే లేదని విమర్శించారు.

New Update
TS: కేసీఆర్ లాగే మీరూ చేయండి.. కాంగ్రెస్ కు హరీష్ రావు కీలక సూచన!

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేసే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కార్‌ ఓడిపోవడంతో.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అమలుకు ఇంకా చర్యలు తీసుకోలేదు కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.

Also Read: ఆరు ఎంపీ స్థానాలు ఖరారు చేసిన బీజేపీ .. అభ్యర్థులు వీళ్లే

విలీనం ఊసే లేదు

కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినట్లు లేఖలో గుర్తుచేశారు. ఎన్నికల కోడ్‌ వల్ల అప్పట్లో విలీనం చేసే తేదీని ప్రకటించలేకపోయామని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఈ బిల్లును అమలుపరిచే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా కూడా విలీనం ఊసే లేదని విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేసినప్పుడే.. దీని విలీనానికి సంబంధించి జీవో విడుదల చేస్తారని కార్మికులు భావించారని తెలిపారు.

కొత్త బస్సులు కొనండి

ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేస్తున్నట్లు వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసుల వల్ల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై భారం పడుతుందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ నిధుల నుంచి జీతాలు ఇవ్వాలని కోరారు. అంతేకాదు ప్రస్తుతం బస్సుల్లో పెరిగిన ప్రయాణికుల రద్దీకి కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయాలని సూచించారు. 2013 పీఆర్సీ బాండ్స్‌కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని.. బాండ్స్‌కు అనుగుణంగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.

Also read: మేడారం జాతరలో బీట్‌ ఆఫీసర్‌పై ఎస్పీ దురుసు ప్రవర్తన

Advertisment
Advertisment
తాజా కథనాలు