Harish Rao: కాంగ్రెస్ గందరగోళంలో ఉంది.. హరీష్ రావు స్వీట్ వార్నింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడంపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరని.. వేసవిలో, రేపు అవసరం పడినపుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? అని ప్రశ్నించారు.

Harish Rao :  సీఎం గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు..రైతుల కోసం.!
New Update

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Party) కృష్ణా బోర్డుకు (Krishna Board) ప్రాజెక్టులు అప్పగించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి (BJP Government) లేఖ రాసిందని అన్నారు. ఇవాళ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మీడియా ముందు ప్రకటించారని అన్నారు.

ALSO READ: ఫ్రీ బస్సు ఎఫెక్ట్… ఆటోను తగలబెట్టుకున్న డ్రైవర్!

27వ తేదీ లేఖ ప్రామాణికమా?... ఇవాళ్టి మీటింగ్ లో అంగీకారం ప్రామాణికమా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించారని నేను చెబితే హరీష్ రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని గొప్పగా చెప్పారని.. మరి ఇవాళ ఏం జరిగింది? శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అని అన్నారు. వేసవిలో, రేపు అవసరం పడినపుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? అని ప్రశ్నించారు. జలవిద్యుత్ హౌస్ ల గురించి చర్చ లేదని చెప్తున్నారు కానీ, నీరు లేకుండా విద్యుత్ ఎలా వస్తుంది?, బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమా?, బోర్డు అనుమతి లేనిదే రాష్ట్ర ఇంజనీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టుల వద్దకు వెళ్ళే పరిస్థితి ఉండదు. మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఏపీ చేతిలో పెట్టడమా?, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా?, అందరితో చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ ఎలా అంగీకరించింది? అని ప్రశ్నల బాణాలు వదిలారు.

ప్రాజెక్టులు అప్పగించబోమని ఓ వైపు చెబుతారు... మరోవైపు మీటింగుల్లో అధికారులు అంగీకరించి వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు... ఇవాళ ఈఎన్సీ కృష్ణా బోర్డు మీటింగ్ కు వెళ్లి ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించి వచ్చారని అన్నారు. 2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించారని ఫైర్ అయ్యారు.

ALSO READ: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో... దీంతోనే స్పష్టం అవుతోందని అన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. రాజకీయాల కోసం మాట్లాడడం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. మేధావులు మౌనం వీడాలని హితవు పలికారు.

DO WATCH:

#cm-revanth-reddy #brs-party #krishna-river-board #harish-rao #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe