BRS : 'అందుకే ఆగుతున్నాం లేదంటే చీల్చి చెండాడే వాళ్ళం'.. కాంగ్రెస్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ఆరు గ్యారెంటీలకు వంద రోజులు కాలేదని ఆగుతున్నామని.. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలను ఎత్తేసిందని.. తెలంగాణలో కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.

New Update
Harish Rao: రాహుల్ గాంధీ హరీష్ రావు లేఖ

Harish Rao : హైదరాబాద్(Hyderabad) లోని బీఆర్ఎస్(BRS Party) ప్రధాన కార్యాలమైన తెలంగాణ భవన్(Telangana Bhavan) లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్(Karnataka Congress) ప్రభుత్వం గ్యారెంటీలను ఎత్తేసిందని.. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలను(Six Guarantees) కూడా ఎత్తివేస్తుందని అన్నారు.

పార్టీ స్థానం మారింది..

ఎన్నికల ఫలితాల తర్వాత నెల రోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించాం అని హరీష్ రావు అన్నారు. ఇది పదకొండో మీటింగ్.. ఇప్పటి దాకా జరిగిన అన్ని సమావేశాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సూచనలు వచ్చాయని అన్నారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది. పార్టీ మీ అభిప్రాయం మేరకే పని చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడినం.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాం అని అన్నారు. మన పార్టీ స్థానం మారిందని.. పాలన నుంచి ప్రతి పక్షానికి వచ్చాం.. అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు.

ALSO READ: GOOD NEWS: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన

ఐదేళ్లకే ప్రభుత్వం మారింది..

రాజస్థాన్ లో ఐదేళ్లకే ప్రభుత్వం మారింది.. ఛత్తీస్ ఘడ్ లో కూడా ఐదేళ్లకే మారింది..ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదని హరీష్ రావు(Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు అని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువ అని ఎద్దేవా చేశారు.

మోసపూరిత హామీలతో అధికారం..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి... మన బడ్జెట్ ఎంత? 2 లక్షల 90 వేల కోట్లు.. బడ్జెట్ కన్నా మించి హామీలిచ్చారు.. ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారు అని అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది.. ఎన్నికలపుడు ఇష్టమొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టి ఇపుడు వాటి గురించి మనం అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

గ్యారెంటీలను ఎత్తేస్తారు..

హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు.. కర్ణాటక లో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని అన్నారు హరీష్. 5 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్ణాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మొన్న మీడియా తో చెప్పారని అన్నారు. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించినట్లు తెలిపారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరం లో లేవని పేర్కొన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో గెలిస్తేనే..

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం.. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని హరీష్ అన్నారు. ఈ కీలక సమయం లో బీఆర్ఎస్ ఎంపీ లు ఢిల్లీ(Delhi) లో లేకపోతే తెలంగాణ కు నష్టం జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం గా నేర్చుకుని ముందుకు సాగుదాం.. పార్లమెంటు లో సత్తా చాటుదాం అని పిలుపునిచ్చారు.

చీల్చి చెండాడే వాళ్ళము..

దావోస్ కు వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉంది పెట్టుబడులకు రావొద్దు అని చెప్పదలుచుకుందా అని హరీష్ అన్నారు. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షం లో ఉండగా ఉత్తమ్ అన్నారు.. ఇప్పుడేమంటారు అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం లో కాంగ్రెస్ హత్యరాజకేయాలు మొదలుపెడుతోంది.. ఇది మంచిది కాదు పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ఇంకా వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నాం.. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారని అన్నారు.

ALSO READ: ‘రాముడి అక్షింతలతో రాజకీయం’..బండి సంజయ్ పై మంత్రి పొన్నం గరం

Advertisment
తాజా కథనాలు