Telangana Mega DSC Notification: తెలంగాణలోని నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy). ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ వేస్తామని అన్నారు. గత 10 ఏండ్లు గా టీచర్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన 2, 3 లక్షల మందికే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మిగతా వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.
పూర్తిగా చదవండి..Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన
వచ్చే నెలలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు.
Translate this News: