KTR TWEET ON MODI:ఇంకెన్నాళ్ళు అబద్ధాలు చెబుతారు- ప్రధాని మోదీ మీద కేటీఆర్ సెటైర్లు

నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటటైర్లు వేశారు. తెలంగాణ గోస తీరేదెప్పుడు అంటూ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు.

KTR TWEET ON MODI:ఇంకెన్నాళ్ళు అబద్ధాలు చెబుతారు- ప్రధాని మోదీ మీద కేటీఆర్ సెటైర్లు
New Update

ట్విట్టర్ లో కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మీద విరుచకుపడ్డారు. కొత్త వాటికి శంకుస్థాపన చేయడం సరే కానీ... కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యార్ ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టకు జాతీయ హోదా ల మాట ఏం చేశారంటూ కేటీఆర్ ప్రశ్నలు వేశారు.మా మూడు ప్రధాన హామీల సంగతేంటంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. మూడురోజుల వ్యవధిలో తెలంగాణకు రెండోసారి వస్తున్నారని.. మరి ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదని నిలదీశారు. 1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ? 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ? 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? అంటూ ప్రశ్నించారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర, మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా అంటూ విమర్శించారు. మూడు రోజుల తేడాలో రెండోసారి తెలంగాణకు వస్తున్నారు..కానీ మా మూడు ప్రధాన హామీల మాటేంటని అడిగారు. పదేళ్ళ నుంచి చెబుతున్న అబద్ధాలను ఇంకెంత కాలం చెబుతారు...తెలంగాణ మీద మీ మనసు కరిగేదెప్పుడు అంటూ క్వశ్చన్ చేశారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారని, లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని అయితే పూర్తిగా మర్చేపోయారని... దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసారని మండిపడ్డారు. పదేళ్ళ పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారని దుయ్యబట్టారు.

మీ పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందన్నారు. ఎన్నికల వేళ ఇప్పుడు హంగామా చేస్తున్నారని, మరి అది అమలు అయ్యేది ఎప్పుడోనని ఎద్దేవా చేశారు కేటీఆర్. ప్రధానిగా మీ పదేండ్ల పాలనలో అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి ఏం దక్కిందని ప్రశ్నించారు. మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని, మళ్లీ వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అన్నారు.

తెలంగాణకు ఇచ్చిన మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని, మళ్లీ వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అన్నారు కేటీఆర్.

also read:టాలీవుడ్ ను షేక్ చేయబోతున్న క్రేజీ కాంబినేషన్?…ప్రశాంత్ నీల్ మాములోడు కాదుగా

#modi #pm #ktr #telanagana #brs #tweet #ex #three-questions
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe